ఓటిటి వాళ్ళు ఆశపడి దెబ్బతిన్నారుగా?
ఇప్పుడు కరోనా లాక్ డౌన్ కారణగంగ చాలామంది చిన్న నిర్మతలు ఓటిటి ఒత్తిడికి తలొగ్గడం అటుంచి.. సినిమాల బడ్జెట్ కి పెట్టిన డబ్బుకి వడ్డీలు కట్టలేక ఓటిటి [more]
ఇప్పుడు కరోనా లాక్ డౌన్ కారణగంగ చాలామంది చిన్న నిర్మతలు ఓటిటి ఒత్తిడికి తలొగ్గడం అటుంచి.. సినిమాల బడ్జెట్ కి పెట్టిన డబ్బుకి వడ్డీలు కట్టలేక ఓటిటి [more]
ఇప్పుడు కరోనా లాక్ డౌన్ కారణగంగ చాలామంది చిన్న నిర్మతలు ఓటిటి ఒత్తిడికి తలొగ్గడం అటుంచి.. సినిమాల బడ్జెట్ కి పెట్టిన డబ్బుకి వడ్డీలు కట్టలేక ఓటిటి ప్లాట్ ఫారం లో సినిమాని విడుదల చేసేందుకు ఒప్పేసుకుంటున్నారు. భారీ బడ్జెట్ సినిమాలు ఓటిటి ఒత్తిడికి తలొగ్గడం లేదుకానీ.. చిన్న చితక, మీడియం రేంజ్ నిర్మాతలు మాత్రం ఓటిటి ఇచ్చే ఆఫర్స్ కి పడిపోతున్నారు. థియేటర్స్ ఎలాగూ మూతవేసి ఉన్నాయి. అందుకే ఆఫర్స్ తో పడగొడితే నిర్మాతలు ఒంగుతారని ఓటిటి వాళ్ళు సినిమాల కోసం ఎగబడ్డారు. అలా పడగొట్టిన తమిళ హీరో సూర్య తన భార్య జ్యోతిక నటించిన సినిమాని ఓటిటిలో తాజాగా విడుదల చేసాడు.
అలాగే మొన్నామధ్యన అమృత రామన్ అనే సినిమా. ఇప్పుడు బాలీవుడ్ లో అక్షయ్ కుమర్ లక్ష్మి బాంబ్ సినిమా కూడా ఓటిటి లో నేరుగా విడుదలకాబోతుంది. అయితే ఇప్పటివరకు ఓటిటిలో విడుదలైన సినిమాలేవీ బ్లాక్ బస్టర్ అవలేదు. రెండు నెలల క్రితం ఓటిటి లో నేరుగా విడుదలైన అమృత రామన్ కి సో సో టాక్ రాగా.. తాజాగా జ్యోతిక నటించిన పొన్ మగళ్ వందాళ్ యావరేజ్ టాక్ మాత్రమే కాదు.. యావరేజ్ రివ్యూస్ ని సొంతం చేసుకుంది. ఈ సినిమా విపరీతంగా ప్రచారం చేసుకుని మరీ ఓటిటిలో విడుదలైంది. ఇక జీ 5 లో విడుదలైన మరో సినిమా కూడా ప్లాప్ టాక్ తెచ్చుకోవడంతో.. ఇప్పుడు ఓటిటి అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్క్ష్, హాట్ స్టార్, సన్ నెట్, జీ 5 వాళ్ళు కడుఆ ఆచి తూచి సినిమాలను కొనేందుకు చూస్తున్నారట.