చరణ్, బన్నీల అవసరం వస్తుందటారా?

Update: 2018-05-26 09:15 GMT

ఈమధ్యన పవన్ కళ్యాణ్ సినిమాలకు బై బై చెప్పేసి రాజకీయాల్లో బిజీ అయ్యాడు. అటు రాజకీయాలతో బిజీగా ఉంటూనే మరోపక్క తన అన్న కొడుకు చరణ్ సినిమాలను, తన బావ కానీ బావ కొడుకు సినిమాని చూసి మరీ అభినందంచడమే కాదు.. ఆ సినిమాల ఈవెంట్స్ కి కూడా ప్రత్యేకంగా వచ్చాడు. తన అన్న కొడుకు చరణ్ రంగస్థలం సినిమా వీక్షించడమే కాదు.. ఆ సినిమా విజయోత్సవ వేడుకకి హాజరయ్యాడు. ఇక అలాగే అల్లు అర్జున్ నా పేరు సూర్య సక్సెస్ మీట్ కి వెళ్లడమే కాదు.. నా పేరు సూర్య సినిమా చూస్తానన్నాడు. ఎప్పుడూ మెగా ఫ్యామిలీతో కాస్త దూరంగా మెసిలే పవన్ కళ్యాణ్ రాజకీయాలతో పాటుగా.. మెగా ఫ్యామిలీకి బాగా దగ్గయ్యాడు. ఇక రామ్ చరణ్ కూడా వీలున్నప్పుడల్లా పవన్ విషయాలు మాట్లాడుతున్నాడు. ఇక బన్నీ అయితే రీసెంట్ గా పవన్ కళ్యాణ్ కి మద్దతు ప్రకటించాడు.

వీరి అవసరం ఉందా..?

ఇక రామ్ చరణ్ బాబాయ్ పిలిస్తే జనసేన ప్రచారానికి వెళ్తానంటూ మీడియా ముఖంగా చెప్పాడు. అలాగే అల్లు అర్జున్ కూడా అంతే. పవన్ కళ్యాణ్ జనసేనకు నా మద్దతునిస్తునానని అన్నాడు. అయితే జనసేన పార్టీ పుట్టకముందు నుండే వన్ మ్యాన్ ఆర్మీలా జనసేనను ఒంటి చేత్తో నడిపిస్తున్న పవన్ కళ్యాణ్ కి అల్లు అర్జున్ అండ్ రామ్ చరణ్ అవసరం ఉందంటారా? తాను రాజకీయాల్లోకి వస్తున్నానని చెప్పినప్పటి నుండి ఏ సభ అయినా సమావేశమైనా తానొక్కడే స్టేజ్ మీదుంటూ తన జనసేన కార్యకర్తలకు కూడా స్టేజ్ మీద చోటివ్వని పవన్ కళ్యాణ్ కి రామ్ చరణ్, అల్లు అర్జున్ ల అవసరం పడుతుందంటారా? 2019 ఎన్నికల సమయం దగ్గరపడుతోంది.. అలాగే 175 స్థానాల్లో ఈ ఎన్నికల్లో పోటీ చేస్తామని చెబుతున్న పవన్ కళ్యాణ్ ఇంతవరకు ఆయా స్థానాల్లో ఎవరు పోటీ చేస్తారో అనేది చెప్పడం లేదు.

గత అనుభవమూ ఉందిగా...

మరి రాజకీయాల్లోకి వచ్చాక అనేకమంది సపోర్ట్ కావాలి. కానీ పవన్ కళ్యాణ్ అందరి సపోర్ట్ తీసుకున్నట్టే అనిపిస్తాడు.. కానీ ఎవ్వరిని దగరికి రానియ్యడు. అలాగే జనసేన కార్యకర్తలు వీరే అంటూ ప్రజలకు చెప్పడు. కనీసం మీడియా కి కూడా చెప్పడు. ఇలాంటి సమయంలో బాబాయ్ పిలిస్తే నేను రెడీ అంటూ రామ్ చరణ్ చెప్తే మాత్రం జరుగుద్దా, అల్లు అర్జున్ విషయము అంతే. అసలు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ని 2019 ఎన్నికల్లో ఎలాంటి పొజిషన్ లో నుంచో బెడతాడో తెలియదు గాని మెగా హీరోలు పవన్ కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అంటూ సోషల్ మీడియాలో కౌంటర్లు వేస్తున్నారు. ఎందుకంటే.. గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చిరుకి అండగా రామ్ చరణ్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ అబ్బా.. వీళ్లేమిటి మొత్తం ఫ్యామిలీ అంతా కదిలి ప్రచారం చేసినా.. సినీ గ్లామర్ కి ఓట్లు పడలేదాయే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానంటూ చెబున్నాడు. చూద్దాం పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అనేది.

Similar News