వకీల్ సాబ్ ని కెలికేస్తున్న పవన్?

బాలీవుడ్ పింక్ ని వకీల్ సాబ్ గా రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వకీల్ సాబ్ షూటింగ్ ని వేణు శ్రీరామ్ పరుగులు పెట్టిస్తున్నాడు కానీ.. [more]

Update: 2020-12-23 07:43 GMT

బాలీవుడ్ పింక్ ని వకీల్ సాబ్ గా రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వకీల్ సాబ్ షూటింగ్ ని వేణు శ్రీరామ్ పరుగులు పెట్టిస్తున్నాడు కానీ.. నిర్మాత దిల్ రాజు వకీల్ సాబ్ ని వేసవిలో విడుదల చేసే యోచనలో ఉన్నాడు.. పవన్ కళ్యాణ్ కాస్త రాజకీయాలకు బ్రేక్ ఇచ్చి సినిమా షూటింగ్స్ లో కంటిన్యుగా పాల్గొంటున్నాడు. ప్రస్తుతం వకీల్ సాబ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ చిత్రీకరణ జరుగుతుంది. ఇప్పటికే వకీల్ సాబ్ సెట్స్ నుండి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కి సంబందించిన పవన్ – శృతి హాసన్ ల పిక్ లీకై వైరల్ అయ్యింది. అయితే వకీల్ సినిమా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో రైతు పోరాట ఉద్యమాల దృశ్యాల చిత్రకరణ షూట్ చెయ్యడం ఆ క్లిప్పింగ్ సోషల్ మీడియాలో లీక్ అవడం ఆ టాపిక్ మీడియాలో వైరల్ అవడం కూడా జరిగింది.

కేవలం రైతు విషయాలనే కాదు.. చాలా టాపిక్స్ వకీల్ సాబ్ లో ఇన్వాల్వ్ చేసాడని.. పవన్ కళ్యాణ్ సూచనల మేరకు దర్శకుడు వేణు శ్రీరామ్ చాలా టాపిక్స్ ఒరిజినల్ లో లేనివి వకీల్ సాబ్ లో యాడ్ చేసారని తెలుస్తుంది. ఏ టాపిక్ ని వదలకుండా చాలా వరకు చాలా చాలా బర్ణింగ్ ఇష్యుస్ ని కవర్ చేసారని తెలుస్తుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కి నల్ల కోటు వేసుకుని లాయర్ కేరెక్టర్ చేయడమనేది అతని డ్రీం. తన డ్రీం రోల్ ఫస్ట్ టైం చేస్తున్నాడేమో.. చాలా టాపిక్స్ పట్ల తన స్పందన తెలపాలి అనుకుంటున్నాడు కనక అవన్నీ వకీల్ సాబ్ లో ఇరికించేస్తున్నారట.

Tags:    

Similar News