పవన్ – మహేష్ కలిసి..!

ఏ సినిమాలో అయినా ఒక హీరో సినిమాలో మరో హీరో నటించినా, లేదంటే చిన్న గెస్ట్ రోల్ చేసిన.. ఆ సినిమాకి క్రేజ్ ఆకాశాన్ని అంటుతుంది.. చిరంజీవి [more]

Update: 2020-12-04 05:04 GMT

ఏ సినిమాలో అయినా ఒక హీరో సినిమాలో మరో హీరో నటించినా, లేదంటే చిన్న గెస్ట్ రోల్ చేసిన.. ఆ సినిమాకి క్రేజ్ ఆకాశాన్ని అంటుతుంది.. చిరంజీవి సినిమాలో చరణ్ నటిస్తున్న ఆచార్యపై ట్రేడ్ లోనే కాదు.. ప్రేక్షకుల్లోనూ బోలెడన్ని అంచనాలున్నాయి. గతంలో స్టార్ హీరోస్ వెంకటేష్ – మహేష్ కలయికలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సూపర్ హిట్. ఇక వెంకటేష్ – పవన్ కలయికలో గోపాల గోపాలా, వరుణ్ – వెంకీ కాంబోలో F2 బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో హీరోల చూస మల్టీస్టారర్స్ పై పడింది. తాజాగా మహేష్ బాబు – పవన్ కళ్యాణ్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారనే టాక్ టాలీవుడ్ ని ఊపేస్తోంది. వరస సినిమాలతో ఖాళీ లేని పవన్ కళ్యాణ్.. మహేష్ బాబు కలిసి ఒకే సినిమాలో.. అబ్బబ్బ వినడానికే ఫాన్స్ కి పూనకలొచ్చేస్తున్నాయి. మహేష్ ఫాన్స్, పవన్ ఫాన్స్ ఎగ్జైట్మెంట్ తో ఊగిపోతున్నారు.

పవన్ కళ్యాణ్ మరో హీరో సినిమాలో నటించడం అంటే మాములు క్రేజుండదు. అయితే ఇప్పుడు పవన్ నటించబోయేది మహేష్ సర్కారు వారి పాటే అంటున్నారు. మహేష్ సర్కారు వారి పాటను దర్శకుడు పరశురామ్ బ్యాంక్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నాడు. బ్యాంక్ లను మోసం చేసి విదేశాలకు పారిపోతున్న బడా బాబుల భాగోతాలను ఈ సినిమా ద్వారా చూపించబోతున్నాడనే టాక్ ఉంది. ఈ సినిమాలో పవన్ ఓ కీలక పాత్రని అది ఐదు నిమిషాల పాత్రని మహేష్ కోసం చేయబోతున్నాడనే టాక్ ఫిలింసర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. సర్కారు వారి పాటలో గెస్ట్ పాత్రే అయినా కథను మలుపు తిప్పే పాత్రలో పవన్ కనిపిస్తాడని టాక్ మాత్రం సోషల్ మీడియాని ఊపేస్తోంది. మరిది గాసిప్ అయినా వినడానికి అద్భుతంగా ఉంది అంటూ మహేష్ ఫాన్స్ అండ్ పవన్ ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు.

Tags:    

Similar News