పవన్ అభిమాని అంటున్నవ్.. చెడగొట్టవ్ కదా?

పవన్ కళ్యాణ్ తో సినిమాలు చెయ్యాలని ఆయన కి వీరాభిమానులైన డైరెక్టర్స్, నిర్మాతలు టాలీవుడ్ లో చాలామందే ఉన్నారు. పవన్ క్రేజ్ కి భీబత్సమైన ఫాన్స్. అందులో [more]

Update: 2020-11-16 05:55 GMT

పవన్ కళ్యాణ్ తో సినిమాలు చెయ్యాలని ఆయన కి వీరాభిమానులైన డైరెక్టర్స్, నిర్మాతలు టాలీవుడ్ లో చాలామందే ఉన్నారు. పవన్ క్రేజ్ కి భీబత్సమైన ఫాన్స్. అందులో కొంతమంది పవన్ సినిమా చెయ్యాలనే తపనతో ఉంటారు. తాజాగా పవన్ కళ్యాణ్ అభిమాని పవన్ తో అయ్యప్పన్ కోషియమ్ రీమేక్ ప్లాన్ చేసాడు. శేఖర్ కె చంద్ర పవన్ అభిమాని. అందుకే పవన్ తో ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకెళదామా అని ఎదురు చూస్తున్నాడట. వకీల్ సాబ్ తర్వాత క్రిష్ సినిమా కానీ, అయ్యప్పన్ కోషియమ్ కానీ పవన్ కళ్యాణ్ మొదలెడతాడని అంటుంటే… అయ్యప్పన్ రీమేక్ డైరెక్టర్ శేఖర్ కె చంద్ర తాను పవన్ తో సినిమా చెయ్యడానికి ఎగ్జైటెడ్ గా ఉన్న అని అంటున్నాడు.

పవన్ తో సినిమా చెయ్యడం కోసం ఓ అభిమానిగా ఎదురు చూస్తున్నా అని, అలాగే అయ్యప్పన్ కోషియమ్ సినిమాని తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేశామని, ఈ సినిమాలో ఉండే ఇంపార్టెన్స్ రోల్స్ ని అందరికి నచ్చేలా డిజైన్ చేశామని, పవన్ ఫాన్స్ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా సినిమా చేస్తానంటూ చెబుతున్నాడు. మరి పవన్ అభిమానులం అంటూ పవన్ తో సినిమా చెడగొట్టావ్ కదా అంటున్నారు. ఎందుకంటే అభిమానులమా అంటూ హీరోయిజాన్ని ఎలివేట్ చేసే క్రమం లో తమ దృష్టి మొత్తం హీరో మీదే పెట్టి.. సినిమాకి దెబ్బేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అందుకే ఇప్పుడు పవన్ ఫాన్స్ కూడా అభిమానివి అంటున్న.. అలా అని చెడగొట్టవ్ కదా అంటున్నారు శేఖర్ ని.

Tags:    

Similar News