"ది కాశ్మీర్ ఫైల్స్" పై ప్రధాని ప్రశంసలు

మంగళవారం జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని మాట్లాడుతూ.. కొత్తగా విడుదలైన "ది కాశ్మీర్ ఫైల్స్" సినిమాను

Update: 2022-03-15 11:43 GMT

న్యూ ఢిల్లీ : కశ్మీరీ పండిట్ల మీద జరిగిన హత్యాకాండ నేపథ్యంతో తెరకెక్కిన "ది కాశ్మీర్ ఫైల్స్" సినిమా సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది. తాజాగా ప్రధాని నరేంద్రమోదీ సైతం ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఇటీవలే విడుదలైన "ది కాశ్మీర్ ఫైల్స్" చాలా మంచి సినిమా అని, అందరూ చూడదగిన సినిమా అని ప్రధాని పేర్కొన్నారు. ఈ సందర్భంగా "ది కాశ్మీర్ ఫైల్స్" చిత్రయూనిట్ ను ప్రధాని అభినందించారు. దర్శకుడు వివేక్‌ అగ్రిహోత్రి, నిర్మాతలు పల్లవి జోషి, అభిషేక్‌ అగర్వాల్‌ ప్రధానిని కలిసిన వాళ్లలో ఉన్నారు.

మంగళవారం జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని మాట్లాడుతూ.. కొత్తగా విడుదలైన "ది కాశ్మీర్ ఫైల్స్" సినిమాను అందరూ చూడాలని కోరారు. ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలని ఆయన ఆశించారు. కాగా.. వివేక్ రంజన్ అగ్నిహోత్రి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో కాశ్మీరీ పండిట్ల బాధను చూపించారు. మరో వైపు సినిమా చూసిన ప్రేక్షకులు భావోద్వేగానికి గురవుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమాకి క్రేజ్ పెరగడంతో తొలి రోజు 600 స్క్రీన్లలో విడుదలైన ది కాశ్మీరీ ఫైల్స్.. ఇప్పుడు ఏకంగా 2000 స్క్రీన్లలో ప్రదర్శించబడుతోంది. 12 కోట్ల రూపాయలతో తీసిన ఈ సినిమా.. ఇప్పటికే 27 కోట్లకు పైగా బిజినెస్ చేసినట్లు సమాచారం.


Tags:    

Similar News