లిప్ లాక్స్ కు నో అంటున్న 'ప్రేమమ్' బ్యూటీ!

Update: 2018-07-16 08:44 GMT

మలయాళం సూపర్ హిట్ మూవీ 'ప్రేమమ్' లో నటించి పాపులర్ అయిన కేరళ భామ మడోనా సెబాస్టియన్ చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి పేరు తెచ్చుకుంది. గ్లామర్ రోల్స్ కాకుండా తన పాత్రకు ఇంపార్టెన్స్ ఉండే రోల్స్ నే ఎంచుకుని సినిమాలు చేస్తుంది ఈ ప్రేమమ్ బ్యూటీ. అయితే ఈమె లిప్ లాక్ సీన్లకు అంగీకరించకపోవడంతో మూడు పెద్ద చిత్రాల్లో నటించే చాన్స్ ను పోగొట్టుకున్నానని చెప్పింది.

భాషా సమస్యలు లేవు

లేటెస్ట్ గా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనసులో విషయాల గురించి చెప్పింది. ప్రస్తుతం విజయ్ సేతుపతితో మూడో సినిమాలో నటిస్తున్న ఈ భామ.. ఈ సినిమాలో తన పాత్ర 5 నిమిషాలే అయినా అది ప్రేక్షకులకు గుర్తుండిపోతుందని చెప్పింది. కేవలం మలయాళమే కాకుండా తెలుగు, తమిళ భాషల్లో నటిస్తున్నానని.. ఇప్పుటివరకు అయితే నాకు భాషా సమస్య రాలేదని చెప్పింది.

ప్రేమ గురించి బహిరంగంగా చెప్పను

ఇక లిప్ లాక్ సీన్స్ కు నేను అంగీకరించనని.. తానూ పూర్తిగా వ్యతిరేకం అని చెప్పింది. మొదటిసారి కౌగిలింత సీన్ చేసేందుకు ఏడ్చేశానని అంది. తనకు బయట వాళ్లతో మాట్లాడాలంటేనే భయం అని...నాకు బిడియం ఎక్కువని చెప్పొకోచింది. ప్రేమ విషయం అనేది తన పర్సనల్ అని అది నేను బహిరంగ చెప్పను అని చెప్పింది.

Similar News