ప్రియా ప్రకాశ్ క్రేజ్ దిగిపోతుందా..?

Update: 2018-10-10 07:10 GMT

దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అనే సామెత మలయాళీ బామ్మా ప్రియా ప్రకాష్ వారియర్ కు వర్తిస్తుంది. ఆ మధ్య తన కన్ను సైగలతో కుర్రకారుని తన వలలో వేసుకున్న ప్రియా.. ఓవర్ నైట్ స్టార్ డం ను సంపాదించుకున్న సంగతి తెలిసిందే. దాంతో ఆమె గురించి మూడు నాలుగు నెలలు పాటు అన్ని ఇండస్ట్రీస్ మాట్లాడుకున్నాయి. ఆమెతో సినిమాలు తీయడానికి చాలామంది అగ్ర నిర్మాతలు ముందుకు వచ్చారు. కానీ ఆమె అప్పుడు ఏమి ఓకే చేయలేదు. ఇప్పుడు ఆమె క్రేజ్ తగ్గింది. తను చేస్తున్న బ్రాండ్ తాలూకు యాడ్స్ కు సరైన రెస్పాన్స్ రావడం లేదు. రీసెంట్ గా అఖిల్ అక్కినేనితో ఓ యాడ్ లో మెరిసిన ఈ తారపై సోషల్ మీడియాలో నెగటివ్ కామెంట్స్ వస్తున్నాయి.

చేసిన సినిమా కూడా విడుదల కాకుండా...

ఆమె నటించిన 'ఓరు ఆధార్ లవ్' ఇంకా విడుదల కానే లేదు. ప్రియాకు వచ్చిన పాపులారిటీతో డైరెక్టర్ ఒమర్ లుల్లూ స్క్రిప్ట్ మొత్తం మార్చేస్తున్నారు అని టాక్. ఎప్పటి నుండో ఈ సినిమా షూటింగ్ జరుగుతూనే ఉంది. కానీ ఇప్పటివరకు కంప్లీట్ అవ్వలేదు. ఎప్పుడు కంప్లీట్ అయ్యి రిలీజ్ అవుతుందో అతనికే తెలియాలి. ఈ సినిమా తప్ప వేరే ఏ సినిమా చేయకూడదని ప్రియా తో డైరెక్టర్ ఒమర్ లుల్లూ అగ్రిమెంట్ రాసుకున్నాడట. అందుకే ఆమెకు క్రేజీ ఆఫర్స్ రాకుండా పోవడానికి ఓ కారణం. అప్పుడేదో కొత్త మొహం.. కొత్త మోజు కాబట్టి యూత్ ప్రియను ఎంకరేజ్ చేసింది. కానీ ఇప్పుడు ఆమె చూస్తుంటే హీరోయిన్ కి ఉండే లక్షణాలు ఏమీ కనపడకపోవడంతో ఎంకరేజ్ చేయలేకపోతున్నారు యూత్. సో దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అని అందుకే అంటారు పెద్దలు.

Similar News