గత శుక్రవారం ప్రియాంక తన బాయ్ ఫ్రెండ్ నిక్ జొనాసే తో కలిసి ముంబై ఎయిర్ పోర్ట్ లో కనబడేసరికి అందరూ ఈ లవ్ బర్డ్స్ ఏ దుబాయో.. లేదంటే మళ్ళీఅమెరికానో చెక్కేశారనుకున్నారు. అంబానీ ఇంట ఎంగేజ్మెంట్ పార్టీకి హాజరైన ప్రియాంక, నిక్ జొనాసే లు ఆ తెల్లారే ముంబై ఎయిర్ పోర్ట్ లో జంట పక్షుల్లా చేతిలో చెయ్యేసుకుని మరి కనిపించేసరికి అందరూ వీరు దుబాయ్ పెళ్లి షాపింగ్ కోసం ఫ్లైట్ ఎక్కుతున్నారని.. కాదు కాదు.. మళ్ళీ అమెరికాకే చెక్కేస్తున్నారని ప్రచారం వీర లెవల్లో జరిగింది. మరి వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని న్యూస్ కూడా ఉండగా.. వీరు ఆ ట్రిప్ వేశారు.
అయితే ప్రియాంక అండ్ నిక్ జొనాసే లు వెళ్ళింది దుబాక్ కి కానీ అమెరికాకి కానీ కాదు. వారు వెళ్ళింది బ్రెజిల్ కి. బ్రెజిల్ లో ఈ జంట ఎంజాయ్ చేస్తుంది. అది కూడా నిక్ జొనాసే మ్యూజిక్ కన్సర్ట్ లో. నిక్ జొనాసే మ్యూజిక్ కన్సర్ట్ ని ప్రియాంక ఎంతో మైమరచి పోయి చూస్తుంది. ప్రియాంక తన ప్రియుడు నిక్ జొనాసే మ్యూజిక్ కన్సర్ట్ ని ఎంజాయ్ చెయ్యడమే కాదు.. తాము బ్రెజిల్ లో ఉన్నామని ఫోటో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోను కూడా పోస్ట్ చేసింది. మరి ఆ ఫొటోస్ తో పాటుగా ప్రియాంక మూడే మూడు అక్షరాలతో him అంటూ తన ప్రేమ (?) ను చాటుకుంది. ఇక ప్రియాంక మాత్రమే ఆ ఫొటోస్ ని షేర్ చెయ్యలేదు. ఆమె బాయ్‌ఫ్రెండ్ నిక్ జొనాసే కూడా తామున్న కొన్ని ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసి తామెక్కడున్నది చెప్పేసారు.