ఆనంద్ శంకర్ దర్శకత్వంలో గీత గోవిందంతో బ్లాక్ బస్టర్ కొట్టకముందే... తమిళంలో నోటా సినిమాని జ్ఞానవేల్ రాజా నిర్మాణంలో తమిళ డెబ్యూగా మొదలు పెట్టాడు విజయ్ దేవరకొండ. ఇక గీత గోవిందం విడుదలవడం సూపర్ హిట్ అయిన 50 రోజులకి మళ్లీ తన నోటా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు విజయ్ దేవరకొండ. తమిళంతో పాటు తెలుగులోనూ శుక్రవారం విడుదల కాబోతున్న నోటా సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. నోటా ప్రీ రిలీజ్ బిజినెస్ విజయ్ కెరీర్ లోనే హైయ్యెస్ట్ అనేలా జరగడం, విజయ్ యాటిట్యూడ్ సినిమా మీద అంచనాలు మరింతగా పెంచాయి. ఇకపోతే ప్రమోషన్స్ తో విజయ్ దేవరకొండ సినిమా మీద అందరిలో ఆసక్తి మరింతగా పెంచుతున్నాడు.
విడుదలకు రెండు రోజులే ఉండగా...
అయితే ఇప్పుడు సెన్సార్ నుండి నోటాకు పంచ్ పడిందనే టాక్ బయటికి వచ్చింది. రాజకీయాల నేపథ్యంలో నిర్మితమైన ఈ సినిమా నుంచి కొన్ని సన్నివేశాలను తొలగించాలని సెన్సార్ సభ్యులు భావించినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలో కొన్ని వివాదాస్పదమైన సన్నివేశాలు... డైలాగులు ఉన్నట్టుగా సెన్సార్ సభ్యులు గుర్తించడంతో సినిమాకి యు/ఏ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది అంటున్నారు. అభ్యంతరకరమైన ఆ సన్నివేశాలను తొలగించాలనీ... ఆ డైలాగులను మ్యూట్ చేయాలని వారు చెప్పారని... ఇక సెన్సార్ చెప్పినట్టుగా నోటా యూనిట్ అదే పనిలో ఉందట. అవన్నీ చేసిన తర్వాత మళ్లీ సెన్సార్ కి వెళ్లాల్సి ఉందట. మరి విడుదలకు కేవలం రెండు రోజులు పెట్టుకుని ఇలాంటి సమస్యలతో నోటా మూవీ ఉండడంతో నోటా మూవీ యూనిట్ కాస్త అయోమయంలో ఉందట.
రెండు భాషల్లోనూ పాగా వేయాలని
ఇక విజయ్ దేవరకొండ నోటా సినిమాతో తమిళంలో పాగా వెయ్యాలని చూస్తున్నాడు. తమిళంలో నోటా హిట్ కొట్టిందా.. రెండు భాషల్లోనూ స్టార్ హీరోగా మారొచ్చనేది విజయ్ ప్లాన్. ఇక ఈ సినిమాలో మెహ్రీన్ తో విజయ్ రొమాన్స్ చెయ్యబోతున్నాడు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ట్రాక్ కి పెద్దగా ఇంపార్టెన్స్ ఉండదని.. విజయ్ పొలిటికల్ లీడర్ గా ఎదగడం.. అనుకోని పరిస్థితుల్లో సీఎం కుర్చీ ఎక్కడంతోనే సినిమా మొత్తం ఉంటుందనే టాక్ ఉంది.