పాపం పూరి!

Update: 2018-05-17 11:16 GMT

పూరి జగన్నాధ్ చాలా ప్లాప్స్ తర్వాత తన రెగ్యులర్ సినిమాలా కాకుండా డిఫరెంట్ యాంగిల్ లో ప్రెజంట్ చేసిన చిత్రం 'మెహబూబా'. ఈ సినిమాతో పూరి కం బ్యాక్ అవుతాడని అంతా అనుకున్నారు కానీ కలెక్షన్స్ చూస్తే పెట్టుబడిలో సగం కూడా వచ్చేలా కనపడడం లేదు. పూరిని నమ్మి పూరి కనెక్ట్స్ బ్యానర్ లో దాదాపు 6 కోట్ల దాకా ఇన్వెస్ట్ చేసింది ఛార్మి. కానీ ఇందులో ఇన్వెస్ట్ చేసిన మొత్తం పోయే ముప్పు పొంచి ఉందని ఫిలింనగర్ టాక్.

ఆస్తులమ్మి మరీ పెడితే...

పూరి తన ఆస్తులు అమ్మి మరీ ఈ సినిమా తీసాడని ఫిలింనగర్ వర్గాలంటున్నాయి. ఇప్పుడు 'మెహబూబా' దెబ్బకు అన్ని కృష్ణార్పణం అని ఫిలింనగర్ టాక్. ఈ సినిమాను దిల్ రాజు రిలీజ్ చేసినప్పటికీ ఆయన అడ్వాన్సు పద్ధతి మీద రాసుకున్నారు. అంటే ఒకవేళ సినిమా ఆడకపోతే ఆ నష్టాలను ఒరిజినల్ నిర్మాతే భరించాలనే కండిషన్ తోనే దిల్ రాజు మార్కెట్ చేసాడని తెలుస్తుంది.

ఛార్మి గుడ్ బై చెబుతుందా..?

ఆకాష్ పూరి నటన వరకు మంచి మార్కులు తెచ్చుకున్నప్పటికీ అతన్ని సోలో హీరోగా పెట్టి సినిమాలు తీసేందుకు నిర్మాతలు ముందు రావడం కష్టమే. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా యావరేజ్ టాక్ రావడంతో ఈ కష్టాలు మరింత రేటింపు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒక్కప్పుడు ఇండస్ట్రీని షేక్ చేసిన కృష్ణ వంశి, పూరి ఇప్పుడు ఇలా సడన్ గా తమ వైభవం కోల్పోవడం నిజంగా బాధాకరం. మరోవైపు 'జోతిలక్ష్మి' సినిమా నుండి 'మెహబూబా' దాకా పూరి బ్యానర్లో ఎంతో కొంత మనీ ఇన్వెస్ట్ చేస్తూ వచ్చిన ఛార్మి ఇంక పూరికి గుడ్ బై చెబుతుందేమో అని అనుమానిస్తున్నాయి ఫిలింనగర్ వర్గాలు.

Similar News