ద్రావిడ్ ముందు అందరూ దిగదుడుపే అంటున్న హీరోయిన్?

టాప్ హీరోయిన్స్ లో చాలామందికి క్రికెటర్స్ అంటే పిచ్చ అభిమానం ఉంటుంది. ఆనుష్క శర్మ లాంటి బాలీవుడ్ హీరోయిన్ అయితే విరాట్ కోహ్లీ లాంటి టాప్ క్రికెటర్ [more]

Update: 2020-06-04 07:52 GMT

టాప్ హీరోయిన్స్ లో చాలామందికి క్రికెటర్స్ అంటే పిచ్చ అభిమానం ఉంటుంది. ఆనుష్క శర్మ లాంటి బాలీవుడ్ హీరోయిన్ అయితే విరాట్ కోహ్లీ లాంటి టాప్ క్రికెటర్ ని పెళ్లి కూడా చేసుకున్నారు. అదే కొంతమంది హీరోయిన్స్ తమ అభిమాన క్రికెటర్స్ ని పొగుడుతూ ఆనందిస్తారు. తాజాగా ఓ టాప్ హీరోయిన్ ద్రావిడ్ ని తెగ పొగిడేస్తోంది. ద్రావిడ్ ఫామ్ లో లేకపోయినా… ఒకప్పుడు ఆయన అట తీరు ముందు ఎవరైనా దిగదుడుపే అంటుంది. అసలు ఈ తరంలో ఎంతమంది గొప్ప క్రికెటర్స్ ఉన్నప్పటికీ.. ద్రావిడ్ కి సాటిరారు ఎవ్వరూ అంటుంది బుట్టబొమ్మ పూజ హెగ్డే. మీ అభిమాన క్రికెటర్ ఎవరు అనగానే పూజ హెగ్డే టకాటకా ద్రావిడ్ మీద తనకున్న అభిమానాన్ని చాటుకుంటుంది.

నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం షూటింగ్స్ లో బిజీగా ఉన్నప్పటికీ…మ్యాచ్ జరుగుతుంటే.. కనీసం స్కోర్ అయినా తెలుసుకుంటాను. క్రికెటర్స్ లో ద్రావిడ్ అంటే చాలా ఇష్టం. ఈతరం క్రికెటర్స్ లో ధోని, కె ఎల్ రాహుల్ ని ఇష్టపడతా. ఈ తరంలో ఎంతమంది క్రికెటర్స్ ఉన్నప్పటికీ… ద్రావిడ్ కూల్, క్లాసికల్ అట ముందు ఎవరు సరితూగలేరు. మరి ఎంత సెలెబ్రిటీ అయినా క్రికెట్ లాంటి ఆటలను చాలామంది లైక్ చేస్తారు.అలాగే పూజ కూడా ద్రావిడ్ ఆయన స్టయిల్ ని ఇష్టపడిందన్నమాట.

Tags:    

Similar News