తెలుగులో 'అందాల రాక్షసి' సినిమాతో తన కెరీర్ ని ప్రారంభించిన రాహుల్ రవీంద్రన్ హీరోగా పెద్దగా సక్సెస్ కాలేకపోయాడు. హీరోగా సినిమాలు చేసినప్పటికీ అవి ఏవీ ఆయనకు సక్సెస్ ఇవ్వలేకపోయాయి. ఇక చివరకు 'శ్రీమంతుడు' సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసినా ఆ సినిమా రాహుల్ కు మంచి పేరు తెచ్చిపెట్టలేకపోయింది.
డైరెక్టర్‌గా మారిపోయి...
దాంతో ఆయన తన రూట్ మార్చుకుని డైరెక్టర్ గా మారిపోయాడు. ప్రస్తుతం అతను సుశాంత్ హీరోగా ‘చి ల సౌ’ సినిమా తీశాడు. చివరిలో ఈ సినిమాకు బడ్జెట్ ప్రాబ్లెమ్ రావడంతో ఆగిపోయింది. ఈ సినిమాను తీసిన తీరు నాగార్జునకి నచ్చడంతో ఆ సినిమాను తన బ్యానర్ పైన రిలీజ్ చేస్తున్నాడు. అంతే కాకుండా అన్నపూర్ణ బ్యానర్ లో రాహుల్ కి నాగ చైతన్యను డైరెక్ట్ చేసే ఛాన్స్ ఇచ్చాడు నాగ్.
ఇక డైరెక్టర్‌గానే తేల్చుకునేందుకు...
అయితే ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందో ఇంకా క్లారిటీ లేదు. సిద్దార్ధ్ తరహాలో ఫ్లాపు సినిమాలు తీసి.. ఆడియన్స్ కు సినిమాలు చూడ్డం రాదు అని తిట్టిపోసే బదులు.. చక్కగా డైరక్టర్ అయిపోయి సెటిలైపోదాం అనుకుంటున్నట్లున్నాడులే. ఈ రెండు సినిమాలతో హిట్ కొడితే ఆయన ఇంకా యాక్టింగ్ వైపు తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు .