పాపం మళ్లీ బ్యాడ్ లక్కే..!

Update: 2018-07-21 08:12 GMT

రాజ్ తరుణ్ పూర్తిగా ఫామ్ కోల్పోయాడు. వరుస డిజాస్టర్స్ తో సతమతమవుతున్న రాజ్ తరుణ్ తాజాగా లవర్ సినిమాతోనూ మళ్లీ ఫ్లాప్ ని సొంతం చేసుకున్నాడు. ఇక ప్రస్తుతం రాజ్ తరుణ్ ని ఇండస్ట్రీలో డిజాస్టర్స్ రాజా అనిపిలుచుకునే పరిస్థితి వచ్చేసింది. గత కొంతకాలంగా యావరేజ్ హిట్ కూడా కొట్టలేక చతికిలపడ్డ రాజ్ తరుణ్ కి ఈ లవర్ కూడా అన్యాయమే చేసింది. పెద్ద బ్యానర్ ని నమ్ముకున్నా రాజ్ తరుణ్ కి పని జరగలేదు. కేవలం తన మార్కెట్ పెంచుకొవడానికి దిల్ రాజు వెంటపడి మరీ ఆయన బ్యానర్ లో సినిమా చేసిన రాజ్ తరుణ్ కి ఈసారి గట్టి దెబ్బె పడింది. ఒకే ఒక్క చిత్రంతో యావరేజ్ ఫేమ్ ఉన్న అనీష్ కృష్ణ తో రాజ్ తరుణ్ ఈ సినిమా చేసాడు.

రాజ్ తరుణ్ దెబ్బ దిల్ రాజుపైనా పడింది

ఇక దిల్ రాజు రాజ్ తరుణ్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకోకుండా ఈ సినిమా కి దాదాపుగా 8 కోట్ల పెట్టుబడి పెట్టాడు. పెట్టుబడి అయితే పెట్టాడు గాని.. తర్వాత రాజ్ తరుణ్ మీద ఇంట పెట్టడం అవసరమా అన్నట్టుగా ఉంది దిల్ రాజు వ్యవహారం. ఎప్పుడూ తన సినిమాల ప్రమోషన్స్ ని పిచ్చెక్కించే దిల్ రాజు లవర్ విషయంలో మాత్రం మిన్నకుండిపోయారు. అసలే బ్యాడ్ లక్ లో ఉన్న రాజ్ తరుణ్ కి మళ్లీమళ్లీ బ్యాడ్ లక్కే తగిలింది. సక్సెస్ ఫుల్ నిర్మాత కూడా రాజ్ తరుణ్ వలన కష్టాల్లో పడ్డాడు. రాజ్ తరుణ్ బ్యాడ్ లక్ దిల్ రాజు కి కూడా అంటుకుంది. అందుకే ఈ లవర్ సినిమా కనీసం యావరేజ్ గా కూడా రాలేదు. మొదటి షోకే సినిమా కి నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది.

విషయం లేదనే ప్రమోషన్స్ చేయలేదా..?

ఈ సినిమా లో రాజ్ తరుణ్ ఓవరాక్షన్ తట్టుకోలేమని, అలాగే ఈ సినిమా కి పాటలు బాగున్నా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ దెబ్బేసిందని, రొటీన్ స్టోరీ తో దర్శకుడు బోర్ కొట్టించేశాడని, సినిమాటోగ్రఫీ బాగున్నప్పటికీ.. ఎడిటింగ్ చెత్తగా ఉందని అంటున్నారు. ఇక రాజ్ తరుణ్ కి జోడిగా నటించిన రిద్ది కుమార్ కూడా సో సో గా ఆకట్టుకుందని అన్నారు. మరి సినిమాలో విషయం లేదని తెలిసే దిల్ రాజు సినిమా ప్రమోషన్స్ కి మళ్లీ ఖర్చు చెయ్యడం ఎందుకనుకున్నాడనే ఫీలింగ్ మాత్రం లవర్ సినిమా చుసిన ప్రతి ఒక్కరిలో కలగడం మాత్రం సహజం. మరి కామెడీ పరంగాను ఏ మాత్రం ఆకట్టుకోలేని లవర్ తో దిల్ రాజు నిర్మాతగా నష్టపోవడమే కాదు. రాజ్ తరుణ్ ఖాతాలో మరో ఫ్లాప్ చేరింది.

Similar News