అక్కడ అంతా రాజమౌళి పెత్తనమేనా..?

Update: 2018-11-10 07:23 GMT

ఇప్పుడు స్టార్ హీరోలంతా రాజమౌళితో సినిమా చేస్తే చాలు కెరీర్ లో అంతా సెట్ అవడమే కాదు... తమ మార్కెట్ కూడా పదింతలు పెరుగుతుందనే ఆలోచనలో ఉన్నారు. సాదాసీదా స్టార్ హీరో రేంజ్ అయిన ప్రభాస్ ని బాహుబలితో ప్రపంచానికి పరిచయం చేసాడు. బాహుబలిని చూసి బాలీవుడ్ కూడా వణికిపోయిందంటే రాజమౌళి దర్శకత్వంలో దమ్మెంతుందో అర్ధమవుతుంది. అందుకే రాజమౌళితో సినిమాలు చేసేందుకు కేవలం హీరోలు మాత్రమే కాదు... నిర్మాతలు కూడా కాచుకుని కూర్చున్నారు. కానీ ఎప్పుడో ఇచ్చిన అడ్వాన్స్ తో డీవీవీ దానయ్య... రాజమౌళితో బడా సినిమా చేసే ఛాన్స్ కొట్టేశాడు. అయితే రాజమౌళి బాహుబలితో భారీగా విరామం తీసుకుని చడీ చప్పుడు లేకుండా ఎన్టీఆర్ - రామ్ చరణ్ తో సినిమా ప్రకటించేసి అందరికీ షాక్ ఇచ్చాడు.

ఛాన్స్ దొరికితే చాలు...

ఇక ఎన్టీఆర్, రామ్ చరణ్... రాజమౌళి సినిమా కోసం ఎప్పటినుండో వెయిట్ చేస్తున్నారు. అలా వారికి ఆ జాక్ పాట్ తగలడంతో.. రాజమౌళి తో కథ కూడా చెప్పించుకోవసరం లేదన్నట్లుగా ఉంది వారి వ్యవహారం. అందుకే ఎక్కడ కనబడినా రాజమౌళి తమకింక కథ చెప్పలేదని చెబుతున్నారు. ఇలా రాజమౌళి హీరోలను లాక్ చేసి మరీ సినిమాని హారామ్ గా మొదలెడుతున్నాడు. ఇక నిర్మాతకైతే డబ్బులిస్తే చాలు.. రాజమౌళి ఏం చేసినా ఇబ్బంది లేదు. మరి రాజమౌళి మీద నమ్మకం ఏ రేంజ్ లో ఉందో దీన్నిబట్టే అర్ధమవుతుంది.

లాభాల్లో వాటా...

రాజమౌళితో సినిమా చేస్తే చాలు తమకి ఎదురులేదనుకుంటున్నారు. అందుకే పారితోషకం పక్కనపెట్టి లాభాల్లో వాటా తీసుకుంటున్నారు వారు. ఇక రాజమౌళి ఎప్పటిలాగే ఈ ప్రాజెక్ట్ కి అన్ని తానై వ్యవహరిస్తున్నాడు. మరి రాజమౌళి మీద ఉన్న నమ్మకంతో హీరోలు, నిర్మాత కూడా పూర్తి బాధ్యతను రాజమౌళి మీదే పెట్టారు. బాధ్యతంతా నెత్తినేసుకుని రాజమౌళి తన ఫ్యామిలీతో నవంబర్ 11న 11 గంటలకు రంగంలోకి దిగి ఈ RRR ప్రాజెక్టు ని సక్సెస్ ఫుల్ గా రెండేళ్లలో కంప్లీట్ చేసి వదులుతాడు. కానీ ఈ రెండేళ్లు మాత్రం ప్రేక్షకుల ఉత్కంఠ మాములుగా ఉండదు.

Similar News