#RRR సినిమా స్టోరీ అదేనా..?

రాజమౌళి సినిమాలు హాలీవుడ్ తరహాలో ఉండడమే కాదు… ఎదో ఒక సినిమాకి ఇన్స్పైర్ అయ్యి సినిమాలు తీస్తాడని అంటారు. తాజాగా రాజమౌళి దర్శకత్వంలో RRR మూవీ సెట్స్ [more]

;

Update: 2018-12-26 07:42 GMT
#rrr movie update
  • whatsapp icon

రాజమౌళి సినిమాలు హాలీవుడ్ తరహాలో ఉండడమే కాదు… ఎదో ఒక సినిమాకి ఇన్స్పైర్ అయ్యి సినిమాలు తీస్తాడని అంటారు. తాజాగా రాజమౌళి దర్శకత్వంలో RRR మూవీ సెట్స్ పైకి వెళ్ళింది. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే పట్టాలెక్కేసినా… రోజుకో న్యూస్ మాత్రం గాసిప్ రూపంలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది. రాజమౌళికి ఇంతవరకు హీరోయిన్స్ దొరకలేదు. ఇప్పుడున్న హీరోయిన్స్ ఎవరూ రాజమౌళి కంటికి కనబడడం లేదా… అంటూ సెటైర్స్ కూడా వేస్తున్నారు.

బాలీవుడ్ సినిమా కథనేనా..?

ఈలోపు రాజమౌళి ఒక బాలీవుడ్ మూవీకి ఇన్స్పైర్ అయ్యి RRR ని తెరకెక్కిస్తున్నాడు అంటూ వార్తలు మొదలయ్యాయి. బాలీవుడ్ లో 1990లో షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ కలిసి నటించిన కరణ్ అర్జున్ అనే మల్టీస్టారర్ కథతో ఈ RRR కథని ముడిపెడుతున్నారు. కరణ్ అర్జున్ సినిమాలో సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ లు అన్నదమ్ములుగా ఒక జన్మలో శత్రువుల చేతిలో హతమై.. మరు జన్మలో వేర్వేరు చోట్ల పుట్టి… కాలానుగుణంగా కలుసుకుని.. ఇద్దరు కలిసి గత జన్మలో తమను చంపిన శత్రువుల మీద పగ తీర్చుకుంటారు. ఇప్పుడు ఇదే తరహాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు కూడా అన్నదమ్ములుగా కలిసి విలన్స్ పని పడతారతారనే టాక్ నడుస్తుంది.

రాజమౌళినే చెప్పాలి…

మరి ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న RRR కథకి బాలీవుడ్ సినిమా కరణ్ అర్జున్ కి ఎంతవరకు పోలికలున్నాయో తెలియదు కానీ.. రాజమౌళి తెరకెక్కించబోయే RRR కథ మాత్రం కరణ్ అర్జున్ సినిమా తరహాలోనే ఉండబోతుందని అంటున్నారు గాసిప్ రాయుళ్లు. మరి అదెంత వరకు నిజమనేది రాజమౌళి చెప్పే సమాధానం బట్టి ఉంటుంది. మరి ఎప్పుడూ కథ చెప్పి బరిలోకి దిగే రాజమౌళి RRR కథ గురించి చిన్న క్లూ కూడా ఇవ్వలేదు. అందుకే RRR పై రోజుకో కథ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Tags:    

Similar News