బాహుబలితో తో రాజమౌళి ఫ్యామిలీ ఎంతగా హైలెట్ అయ్యిందో.. రాజమౌళి కొడుకు కార్తికేయ కూడా అంతే హైలెట్ అయ్యాడు. రాజమౌళి కి వెన్నంటి ఉండే కార్తికేయ.. తర్వాత ఫ్రెండ్స్ తో కలిసి సినిమాలు కూడా నిర్మించడం మొదలు పెట్టాడు. రాజమౌళి కున్న అదృష్టం లక్ కానీ కార్తికేయకు నిర్మాతగా కలిసిరాలేదు. తండ్రి చాటు బిడ్డగా కాకుండా తనకంటూ ఇమేజ్ ని సృష్టించుకోవడానికి తపన పడుతున్నాడు. ఇక తాజాగా పెళ్లి కొడుకు అవవడమే కాదు .. తన సొంత బ్యానర్ లో రాజమౌళి దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన అశ్విన్ గంగరాజు అనే కొత్త కుర్రాడితో డిఫరెంట్ కాన్సెప్ట్ ఆకాశవాణి అంటూ ఒక సినిమాని తెరకెక్కిస్తున్నాడు.
కార్తికేయ పెళ్లి ఈ నెల 31 న జరగబోతుంటే.. ఆకాశవాణి సినిమా మాత్రం జనవరి నుండి రెగ్యులర్ షూటింగ్ కోసం వెళ్లనుంది. భారీ బడ్జెట్ కాదు కానీ.. మీడియం బడ్జెట్ తో తెరకెక్కించనున్న ఈ సినిమాకి కీరవాణి కొడుకు కాల భైరవ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నాడు.ఇక జనవరి నుండి మొదలవ్వబోయే ఈ సినిమాలోని విలన్ పాత్ర కోసం ప్రస్తుతం సెర్చింగ్ జరుగుతుందట. అయితే మలయాళ నటుడు మోహన్ లాల్ ని ఆకాశవాణి టీం విలన్ పాత్ర కోసం సంప్రదిస్తున్నారనే న్యూస్ నడుస్తుంది. మరి జనతా గ్యారేజ్, మనమంతా సినిమాల్తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన మోహన్ లాల్ ఆకాశవాణి లో విలన్ గా నటిస్తే సినిమాపై భారీ అంచనాలు పెరుగుతాయి.
అయితే మోహన్ లాల్ ఒకవేళ ఆకాశవాణి లో విలన్ పాత్ర కి నో చెబితే గనక... మోహన్ లాల్ ప్లేస్ లోకి ఈమధ్యనే గరుడ వేగతో మళ్ళీ హీరోగా ఫామ్ లోకొచ్చిన రాజశేఖర్ ని ఒప్పించి విలన్ పాత్రలో చేయించాలనే ప్లాన్ లో ఆకాశవాణి టీం ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి గతంలో రాజశేఖర్ తాను విలన్ పాత్రలు చెయ్యడానికి కూడా రెడీ అని చెప్పాడు. మరి మనం ఆకాశవాణి లో మోహన్ లాల్ ని చూడలేకపోతే రాజశేఖర్ ని విలన్ గా చూడొచ్చన్నమాట.