హమ్మయ్య 2.0 విడుదలపై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

Update: 2018-07-11 02:57 GMT

కోలీవుడ్ లో అన్ని భాషలను టార్గెట్ చేస్తూ భారీ బడ్జెట్ అంటే కళ్ళు చెదిరేలా.. 450 కోట్ల బడ్జెట్ తో కోలీవుడ్ బడా నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మించిన 2.o సినిమా ముచ్చట్లు మళ్ళీ మీడియాలో మొదలైపోయాయి. నిన్నమొన్నటివరకు 2.0 మీద సైలెంట్ అయిన మీడియా ఇప్పుడు మళ్ళీ 2.0 సినిమా ముచ్చట్లను షురూ చేసింది. ఎందుకంటే గత రెండేళ్ల క్రితం మొదలైన 2.0 సినిమా ఎట్టకేలకు విడుదల కాబోతుంది. శంకర్ - రజినీకాంత్ కాంబోలో భారీ క్రేజ్ ఉన్న ఈ సినిమా ఇప్పటివరకు విడుదల తేదీలను మార్చుకుంటూ వస్తూ... సినిమా మీద క్రేజ్ తగ్గించుకుంటుందని ప్రచారం జరుగుతున్న తరుణంలో ఇప్పుడు 2.0 సినిమా విడుదల తేదీ బయటికి వచ్చింది. ఇప్పటివరకు గ్రాఫిక్ పనులతో 2.0 సినిమా విడుదల డిలే అవుతూ వచ్చింది. అయితే గత కొన్ని రోజులనుండి 2.0 సినిమా మీద ఎలాంటి అప్ డేట్స్ లేవు. 2.0 నిర్మాతలు లైకా పొడక్షన్స్ వారు కూడా సైలెంట్ అయ్యేసరికి ఈ ఏడాది లో ఇక 2.0 సినిమా విడుదల లేనట్లే అని అందరూ డిసైడ్ అయ్యారు.

ఇక భారీ రేట్లకు ఈ సినిమాని కొనుక్కున్న బయ్యర్లు చేతులెత్తేస్తున్నారని ... ఇక ఈసినిమా ఈ ఏడాది విడుదల కష్టమంటూ మొన్నటివరకు కొన్ని వార్తలు సోషల్ మీడియాలో ప్రచారం జరిగాయి. ఇక సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా 2.0 సినిమా విషయాలేమి చెప్పకపోయేసరికి... ఈసినిమాపై ఉన్న ఆసక్తి తగ్గుతుందంటూ ప్రచారం మొదలయింది. అయితే అలాంటి ప్రచారానికి ఈ సినిమా దర్శకుడు శంకర్ చెక్ పెట్టేసాడు. తాజాగా శంకర్ ఈ సినిమా విడుదలపై స్పష్టమైన క్లారిటీ ఇచ్చేసాడు. తాజాగా శంకర్ ట్వీట్ చేస్తూ 2.0 సినిమా నవంబర్ 29 న విడుదలవుతుందని... ఎట్టకేలకు విఎఫెక్స్ వారు తనకి హామీ ఇవ్వడంతో.. ఈ సినిమా డేట్ ఎనౌన్స్ చేస్తున్నట్లుగా ట్వీట్ చేసాడు. దీనితో... 2.0 సినిమా నవంబర్ 29 రావడం పక్కా అయ్యింది.

అయితే గతంలోనూ లైకా ప్రొడక్షన్స్ వారు మా 2.0 సినిమా ఏప్రిల్ లో విడుదల అంటూ ఒక ప్రకటన ఇవ్వడం తర్వాత మళ్ళీ సైలెంట్ అవడంతో.. ఈసినిమా విడుదలలో జనాలు ఒక క్లారిటీకి రాలేదు. ఇక ఇప్పుడు ఈ సినిమా దర్శకుడు మాటిచ్చాడు కాబట్టి ఈసినిమా ఖచ్చితంగా నవంబర్ 29 న థియేటర్స్ లోకి వచ్చి తీరుతుంది అనే నమ్మకం అందరిలో కలుగుతుంది. అక్షయ్ కుమార్ విలన్ గా, అమీ జాక్సన్ హీరోయిన్ గా సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా ఈసినిమా భారీ పెట్టుబడి అంటే దాదాపుగా 450 కోట్ల పెట్టుబడితో లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మించారు

Similar News