జైలర్ విలన్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఎందుకో తెలుసా..?
న్యూసెన్స్ కేసు కింద జైలర్ మూవీ విలన్ ని అరెస్ట్ చేసిన కేరళ పోలీసులు.
సూపర్ స్టార్ రజినీకాంత్ రీసెంట్ గా 'జైలర్' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టుని అందుకొని భారీ కమ్‌బ్యాక్ ఇచ్చాడు. నెల్సన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ తమిళంలోనే కాకుండా తెలుగు, ఇతర భాషల్లో కూడా అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టి సూపర్ హిట్టుగా నిలిచింది. ఇక ఈ సినిమాలో విలన్ గా నటించిన 'వినాయకన్' మంచి గుర్తింపునే సంపాదించుకున్నాడు. అంతకుముందు ఎన్నో సినిమాల్లో విలన్ గా చేసినా రాని ఫేమ్ ని జైలర్ తో వినాయకన్ అందుకున్నాడు.
ఇక రీల్ లైఫ్ లో తప్పు పనులు చేసి జైలుకి వెళ్లే ఈ విలన్.. ఇప్పుడు రియల్ లైఫ్ లో కూడా ఒక తప్పు చేసి జైలుకి వెళ్ళాడు. కేరళలోని ఎర్నాకులంలో నివాసం ఉంటున్న వినాయగన్.. రోజు మద్యం తాగి వచ్చి చుట్టు పక్కల ఉన్నవారిని ఇబ్బందికి గురి చేస్తున్నాడట. దీంతో వారంతా కలిసి పోలీసులను ఆశ్రయించారు. వినాయగన్ ని పోలీసులు హెచ్చరించే ప్రయత్నం చేయగా.. వారితో కూడా వినాయగన్ దురుసుగా ప్రవర్తించడంతో న్యూసెన్స్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు సమాచారం.
అయితే కొద్దిసేపటికే వినాయగన్ ని రిలీజ్ చేసేసినట్లు సమాచారం. ఇప్పుడు ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది. జైలర్ సినిమాతో రాకరాక వచ్చిన ఫేమ్ ని ఇలాంటి పనులు చేసి చెడగొట్టుకుంటే మల్లి అవకాశాలు రావడం కష్టమే అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. కాగా జైలర్ సినిమాలో హీరో ఎలివేషన్స్ ఎంత పాపులర్ అయ్యాయో.. అంతకంటే ఎక్కువుగా విలన్ గ్యాంగ్ లో జరిగే సీన్స్ అంతగా ఫేమస్ అయ్యాయి. ఏఆర్ రెహమాన్ పాటలకి విలన్ గ్యాంగ్ చేసే డ్యాన్సులు ఆడియన్స్ ని బాగా అక్కటుకున్నాయి.