మరలాగే అనాలి. ఎందుకంటే రజినీకాంత్ సినిమాల టీజర్స్ చూసి ఆయన సినిమాలు గొప్పగా ఉంటాయని ఊహించుకుని సినిమాలకు వెళ్లివారు గత కొన్ని సంవత్సరాలుగా గుడ్లు తేలేస్తున్నారు. లింగా, కాలా, కబాలి ఇలా అన్ని చిత్రాల టీజర్స్ ట్రైలర్స్ సినిమాల మీద విపరీతమైన ఆసక్తిని పెంచేసాయి. కానీ సినిమాలో మాత్రం విషయం లేదు. కాలా కానివ్వండి, కబాలి కానివ్వండి అన్ని సినిమాలు ఒకేలా ఉన్నాయి. ఏదో మొన్న శంకర్ డైరెక్షన్ లో వచ్చిన 2.0 రజినీ ని కాస్త గాడిలో పడేసింది. కానీ ఆ సినిమా హిట్ మొత్తం 3డి కే అంటే విఎఫెక్స్ కె వెళ్ళింది కానీ.. ఎక్కడా రజినిపేరు వినబడనేలేదు. ఇంకా చెప్పాలంటే నెగటివ్ రోల్ ప్లే చేసిన అక్షయ్ ని పొగిడారు కానీ రజినిపేరు మాత్రం వినబడలేదు.
ఇక తాజాగా కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెటా సినిమా టీజర్ ని రజినీకాంత్ పుట్టినరోజు సందర్భగా ఈ రోజు బుధవారం విడుదల చేసింది చిత్ర బృందం. రజనీ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంలో రజనీ మార్క్ మాస్ అండ్ స్టైల్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్న ఈ టీజర్ రజనీ అభిమానులకు నిజమైన పండగ. ముఖ్యంగా.. ఆ వాకింగ్ స్టైల్ మరింత స్టైలిష్ గా కనిపిస్తున్న రజనీకాంత్ ఈ టీజర్ లో ప్రత్యేక ఆకర్షణ. ఒక లుక్ ట్రెడిషనల్ గా, మరో లుక్ స్టైలిష్ గా ఉన్న రజినీ లుక్స్ మాత్రం విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అసలు ఆ టీజర్ చూసిన తలైవా అభిమానులు తలైవా ఈజ్ బ్యాక్ అంటూ పొంగిపోతున్నారు.
కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో విజయ్ సేతుపతి , సిమ్రాన్ , త్రిష ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా.. అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. ఇక టీజర్ తోనే దుమ్మురేపిన రజినీ. త్వరలోనే ట్రైలర్ తో వచ్చేస్తానంటున్నాడు. మరి ఇలా ఆసక్తికరమైన ప్రమోషన్స్ తో ఆకట్టుకుంటున్న రజినీ పెటా వచ్చే సంక్రాతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.