మహానటి సినిమాలో ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖ నటీనటులను, డైరెక్టర్స్ ని నాగ్ అశ్విన్ గెస్ట్ పాత్రల కింద తీసుకుని వారిని మహానటి లో సావిత్రి నట జీవితంలో భాగమైన అత్యంత కీలక వ్యక్తులుగా చూపించాడు. ఇక ఆ సినిమాలో పెద్ద పెద్ద వాళ్లే అతిధి పాత్రల్లో మెప్పించారు. ఇక తాజాగా మహానటి సావిత్రి బయో పిక్ మాదిరిగానే టాలీవుడ్ లో అలనాటి మేటి నటుడు, తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆపన్న హస్తం అందించి అందరి హృదయాలలో స్థానం సంపాదించిన నటకిరీటి నందమూరి తారక రామారావు గారి జీవిత చరిత్రని దర్శకుడు క్రిష్ ఎన్టీఆర్ బయో పిక్ గా తెరకెక్కిస్తున్నాడు. బాలకృష్ణ ప్రధాన అంటే ఎన్టీఆర్ పాత్రధారిగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో టాలీవుడ్ లోని చాలామంది నటులను భాగస్వామ్యం చేస్తున్నాడు క్రిష్. మరి ఎన్టీఆర్ నట జీవితంలో ఆయనతో కలిసి నటించిన నటుల దగ్గర నుండి ఆయనతో సినిమాలు చేసిన హిట్ దర్శకుల వరకు చాలామంది ఉన్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ బయో పిక్ లో చంద్రబాబు పాత్రకి హీరో రానాని, సావిత్రి పాత్రకి కీర్తి సురేష్ ని, బసవతారకం పాత్రకి విద్య బాలన్ ని ఎంపిక చెయ్యడమేకాదు, నరేష్ ని, ప్రకాష్ రాజ్ ని, సచిన్ కేడెకర్ ని, మోహన్ బాబు ని వివిధ పాత్రలకు ఎంపిక చేసారు. విద్య బాలన్ ఇప్పటికే ఎన్టీఆర్ బయో పిక్ షూటింగ్ లో భాగమైంది. ఇకపోతే ఈ సినిమా లో రకుల్ ప్రీత్ సింగ్ కూడా మెరుస్తుందని.. అది కూడా ఒక ఐటెం సాంగ్ లో అనే ప్రచారం జరిగింది.
మరి రకుల్ ప్రీత్ సింగ్ ఐటెం సాంగ్ కాదంటగాని.. ఎన్టీఆర్ బయోపిక్ లో రకుల్ శ్రీదేవి పాత్ర పోషించబోతున్నట్లుగా తెలుస్తుంది. ఎన్టీఆర్ - శ్రీదేవి ది హిట్ ఫెయిర్. అందుకే ఎన్టీఆర్ బయోపిక్ లో శ్రీదేవి పాత్రకు రకుల్ ని ఎంపిక చేసినట్లుగా తెలుస్తుంది. మరి ఎన్టీఆర్ నట జీవితంలో ఒక సినిమా చేసేయ్యొచ్చు. అలాంటిది ఎన్టీఆర్ బయోపిక్ లో ఆయన నటజీవితం, రాజకీయ జీవితాన్ని కలిపి ఒకే ఒక సినిమా అంటే.. ఎన్టీఆర్ నట జీవితం పూర్తిగా కాకుండా.. రాజకీయ జీవితాన్ని కూడా పూర్తిగా కాకుండా క్రిష్ ఈ సినిమాని ఎన్టీఆర్ బయోపిక్ గా ఎలా తెరకెక్కిస్తాడో అనే సస్పెన్స్ నడుస్తుంది కూడా. అయితే ఇప్పుడు సావిత్రి పాత్రకి కీర్తి సురేష్ ని, శ్రీదేవి పాత్రకి రకుల్ ని తీసుకుంటున్న ఎన్టీఆర్ యూనిట్ వాళ్ళని కేవలం గెస్ట్ పాత్రలకే పరిమితం చేస్తారా.. లేదా అనేది కూడా టోటల్ సస్పెన్స్. ఎందుకంటే ఇప్పటికే ఎన్టీఆర్ వైఫ్ పాత్రలో నటిస్తున్న విద్యాబాలన్ బసవతారకం పాత్రలో పాత్రలో మెరుస్తుందనే టాక్ ఉంది. మరి మహానటి వలే ఎన్టీఆర్ బయోపిక్ లో భాగమైనా అతిరథ మహారథులు కూడా ఇలా వచ్చి అలా మాయమైపోరు కదా అనే అనుమానం బలంగా పేరుకుపోతుంది.
ఇక కీరవాణి సంగీతం అందిస్తున్న ఎన్టీఆర్ బయో పిక్ షూటింగ్ ని చక చక కానిచ్చేసి వచ్చే సంక్రాంతికే ఎన్టీఆర్ బయోపిక్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు మేకర్స్. ఇక క్రిష్ డైరెక్షన్ అంటే ఆ సినిమా ఆఘమేఘాల మీద షూటింగ్ జరుపుకోవడం అనేది పక్కా.