డైరెక్టర్ బోయపాటి శ్రీను సినిమా అవుట్ ఫుట్ విషయంలో ఎక్కడా రాజీ పడడు. తాను అనుకుంది అనుకున్నట్టు వచ్చే దాకా ఆ సినిమాను చెక్కుతూనే ఉంటాడు. అందుకే బోయపాటి షూటింగ్ కంప్లీట్ చేయడానికి చాలా సమయం తీసుకుంటాడు. ఈ ఆలస్యం వల్ల అప్పుడప్పుడు రిలీజ్ డేట్ ని కూడా వాయిదా వేయాల్సి ఉంటుంది. రామ్ చరణ్ సినిమా విషయంలో కూడా అదే చేస్తున్నాడు బోయపాటి. అవుట్ పుట్ విషయంలో ఎవరి మాట వినట్లేదట. అదే ఈ సినిమా ఇంత లేట్ అవ్వడానికి కారణం. దీంతో అభిమానుల్లో ఈ సినిమా జనవరి 11 న రిలీజ్ అవుతుందా..? లేదా వాయిదా పడుతుందా..? అన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి.
జనవరి 11న రావడం ఖాయం...
అయితే బోయపాటి టీం మాత్రం ఈ సినిమా ఎట్టి పరిస్థితిల్లో జనవరి 11న విడుదల అవుతుందని చెబుతున్నారు. ఇంకా ఈ సినిమాకి సంబంధించి 10 రోజులు టాకీ పార్ట్ తో పాటు 2 సాంగ్స్ బ్యాలెన్స్ ఉన్నాయని చెబుతున్నారు. వచ్చే నెల అంటే నవంబర్ చివరికల్లా షూటింగ్ పార్ట్ పూర్తి చేయాలని భావిస్తోంది చిత్ర బృందం. ఎప్పటికప్పుడు ఎడిటింగ్ వర్క్ కూడా పారలల్ గా జరుగుతుంది అంట. డిసెంబర్ లో ప్రమోషన్స్ స్టార్ట్ చేసి జనవరి 11న ఈ సినిమాను విడుదల చేస్తాం అని టీం చెబుతుంది.