మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా మారి ఆ పనులు తన భుజంపై వేసుకున్నాడు. తన తండ్రి రీఎంట్రీ అయిన ఖైదీ నెంబర్ 150 తో ఆయన నిర్మాతగా మారాడు. 151 చిత్రం 'సైరా' ని కూడా నిర్మిస్తున్నాడు రామ్ చరణ్. ఇప్పటికే చాలావరకు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా యొక్క టీజర్ రీసెంట్ గానే రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ కి రిలీజ్ అవుతుందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. అయితే రామ్ చరణ్ ఈ సినిమా ప్రొమోషన్స్ విషయంలో ఎందుకో అంత యాక్టివ్ గా కనిపించడం లేదు. చిరంజీవి కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇందులో తమిళ నటులు విజయ్ సేతుపతి, నయనతార లాంటి స్టార్స్ నటిస్తున్నారు. వీరితో పాటు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కూడా ఫుల్ లెంగ్త్ రోల్ లో కనిపించనున్నారు. ఇంతమంది నటిస్తున్న ఈ సినిమాను బాహుబలి స్థాయిలో ప్రమోట్ చేయాలి. కానీ రామ్ చరణ్ లైట్ గా తీసుకుంటున్నాడు.
అమితాబ్ లుక్ విషయంలోనూ...
ఇలాంటి సినిమాలకు అంచలంచెలుగా ప్రమోషన్, పబ్లిసిటీని డిజైన్ చేయాలి. చేతికందిన ఏ అవకాశాన్ని వదలకూడదు. కానీ చరణ్ ఆలా చేయడం లేదు. పాత్రలకు తగట్టు మోషన్ పోస్టర్స్ వదులుతున్నారు కానీ అందులో ఎటువంటి ఇంట్రస్టింగ్ ఎలిమెంట్ లేదు. రెండు రోజులు కిందట అమితాబ్ బచ్చన్ బర్త్ డేకి కూడా ఇలానే చేశారు. ఆయన లుక్ ని కూడా చాలా సింపుల్ గా అందరివీ వదిలేసినట్టు వదిలేసాడు చరణ్. ఆ లుక్ అంత గొప్పగా ఏమి లేదు. అమితాబ్ బచ్చన్ లాంటి సూపర్ స్టార్ నటిస్తున్నాడంటే ఈ సినిమాని బాలీవుడ్ జనాల్లోకి చొచ్చుకుపోయేలా ప్రమోట్ చేయాలి. కానీ చరణ్ ఆ దిశగా ఆలోచిండం లేదు. బాలీవుడ్ లో కూడా ఈ సినిమాకు మంచి బిజినెస్ జరగాలంటే కచ్చితంగా ప్రొమోషన్స్ అనేవి చాలా అవసరం. మరి ఈ విషయంలో చరణ్ మరింత కేర్ తీసుకోవాల్సి వుంది.