వరుణ్-లావణ్య పెళ్లి వేదిక అక్కడే.. లీక్ చేసిన ఉపాసన..

వరుణ్-లావణ్య పెళ్లి ఎప్పుడు, ఎక్కడ జరగబోతుందని అభిమానులంతా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఉపాసన పెళ్లి వేదికను..

Update: 2023-10-09 05:53 GMT

టాలీవుడ్ రీల్ లైఫ్ కపుల్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి.. ఇప్పుడు రియల్ లైఫ్ లో ఒకటి కాబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల జూన్ లో ఎంగేజ్మెంట్ రింగులు మార్చుకొని వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ని స్టార్ట్ చేశారు. తాజాగా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ అంటూ మెగా కుటుంబమంతా కలిసి చిరు ఇంటిలో.. వరుణ్-లావణ్య పెళ్లి వేడుకను గ్రాండ్ గా జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను మెగా ఫ్యామిలీ మెంబెర్స్ ఒక్కొక్కరిగా షేర్ చేస్తూ వచ్చారు.

ఈక్రమంలోనే ఉపాసన కూడా కొన్ని ఫోటోలు షేర్ చేస్తూ.. వరుణ్-లావణ్య పెళ్లి వేదిక ఎక్కడ అనేది లీక్ చేశారు. ఈ వివాహం ఎప్పుడు, ఎక్కడ జరగబోతుంది అనే విషయాలు కోసం మెగాభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. కాగా ఈ పెళ్లి వేడుకకు ఇటలీ వేదిక కానుంది. ఉపాసన ఫోటోలు షేర్ చేస్తూ.. "టుస్కానీ మేము వస్తున్నాం" అంటూ కామెంట్ చేశారు. టుస్కానీ నగరం ఇటలీ దేశంలో ఉంది. అక్కడ ఒక హోటల్ లో వీరి వివాహ వేడుక ఘనంగా జరగబోతుందని తెలుస్తుంది.
అయితే పెళ్లి డేట్ గురించి మాత్రం ఎటువంటి సమాచారం లేదు. కానీ నవంబర్ ఫస్ట్ వీక్ లో ఈ వివాహం జరగనుందని ఫిలిం వర్గాల్లో మాటలు వినిపిస్తున్నాయి. ఇక ఎంగేజ్మెంట్ మాదిరి.. ఈ పెళ్లి వేడుక కూడా మెగా, అల్లు, లావణ్య కుటుంబసభ్యులు మధ్యనే కానుంది. ఈ వివాహం కోసం మెగా హీరోలంతా తమ షూటింగ్స్ కి బ్రేక్ చెప్పేశారట.
కాగా వరుణ్, లావణ్య దాదాపు ఆరేళ్ళ పాటు రహస్య ప్రేమాయణం నడిపారు. 'మిస్ట‌ర్' సినిమాతో ఏర్పడిన స్నేహం ఆ తరువాత ప్రేమగా మారింది. 'అంత‌రిక్షం' మూవీ టైంకి ఇద్దరు ప్రేమలో ఉన్నారు. వరుణే ముందుగా లవ్ ప్రపోజ్ చేశాడట. దానికి లావణ్య కూడా ఒకే చెప్పడం, ఇద్దరి ఫ్యామిలీస్ కి ప్రేమ గురించి చెప్పడం, వాళ్ళు ఒకే అనడం జరిగిపోయింది.


Tags:    

Similar News