రామ్ చరణ్ సుకుమార్ దర్శకత్వంలో 1980 లో రంగస్థలం సినిమా చేసాడు. ప్రేమ, పగ, గ్రామ కక్షలు అన్ని రంగస్థలం సినిమాని హిట్ చేశాయి. 1980 నాటి పరిస్థితులను సుకుమార్ తెర మీద ఆవిష్కరించిన తీరు అద్భుతః అన్నట్టుగా ఉంది. అలాంటి అంటే 1980 గెటప్స్, రామ్ చరణ్, సమంత, జగపతి బాబు, అనసూయ, ఆది పినిశెట్టిలు సరిగ్గా అతికారు. సినిమాలోని పాత్రల తీరు తెన్నులు డైలాగ్స్, భాష అన్ని ప్రేక్షకులను కట్టిపడేశాయి.మరి రామ్ చరణ్ 1980 ని తెరమీద చూపిస్తే ఇప్పుడు మరో హీరో 1960 ప్రేమ కథను చూపించబోతున్నాడట.
1960 లో ప్రభాస్.....
ఆ హీరో ఎవరో కాదు.. ప్రభాస్. సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ సాహో చిత్రాన్ని చేస్తుంటే... ఈ ఏడాది రాధాకృష్ణ దర్శకత్వంలో మరో ప్రేమ కథను పట్టాలెక్కించాడు. పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే ఇటలీలో ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. ఇది రొమాంటిక్ క్యూట్ లవ్ స్టోరీ అని... ఇది 1960 కాలం నాటి అద్భుతమైన ప్రేమకథ అనే విషయం తాజాగా బయటికి రావడంతో అందరిలో మరింతగా ఆతృత పెరిగిపోతోంది. మరి 1960 లోని ప్రేమ కథ అంటే.. ఈ సినిమా కూడా రామ్ చరణ్ రంగస్థలాన్ని తలపిస్తుందా అనే డౌట్ ఇప్పుడు ప్రభాస్ ఫాన్స్ లో తొణికిసలాడుతుంది.
శ్రీమంతుడిగా....
ఇంకా ఈ సినిమాలో ప్రభాస్ శ్రీమంతుడిగా .. పాతకాలం నాటి కార్లను ఇష్టపడే వ్యక్తిగా కనిపిస్తాడని అంటున్నారు. మరి 1960 ని దర్శకుడు ఆవిష్కరిస్తాడో.. లేదంటే.. ఫ్లాష్ బ్యాక్ లో మాత్రం చూపించేసి... సినిమా మొత్తం 2019 ని చూపెడతాడో తెలియదు కానీ.. ప్రభాస్ సినిమా ఫ్లాష్ బ్యాక్ లో మరో హీరోయిన్ ఉండబోతుందని.. అయితే ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కోసం ఇప్పటికే అనుష్క ని సంప్రదించినట్లుగా తెలుస్తుంది.