భల్లాలదేవగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రానా తెలుగులో మోస్ట్ వాంటెడ్ హీరోగా మారాడు. మన తెలుగు నుండే కాదు ఇతర భాషల్లో కూడా ఛాన్సులు వస్తున్నాయి. రానా నటుడిగా ఎంత గుర్తింపు తెచుకున్నాడో అదే విధంగా వివాదాల్లో కూడా అంతే పేరు తెచ్చుకున్నాడు. తరుచుగా వివాదాల్లో ఉండే రానా ఆ మధ్య బాలీవుడ్ నటి బిపాషా బసుతో కొన్నాళ్లు ప్రేమాయణం నడిపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కోలీవుడ్, టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఎదిగిన త్రిషతో కూడా మనవాడు కొన్నాళ్లు ప్రేమ వ్యవహారాలు కొనసాగించాడు. మరి ఏమైందో ఏంటో ఇద్దరు బ్రేక్ అప్ చెప్పేసుకున్నారు. అయితే అసలు విషయంలోకి వెళ్తే త్రిష - విజయ్ సేతుపతి జంటగా కోలీవుడ్ లో “96” అనే సినిమాలో నటించారు. ఇది ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమాకు అక్కడ మంచి రెస్పాన్స్ వచ్చింది.
నేనే నటిస్తాననంటున్న రానా...
ఇప్పుడు ఆ సినిమా తెలుగు రైట్స్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు కొన్నారు. ఇక్కడ త్వరలో అది సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే తెలుగులో కూడా హీరోయిన్ గా త్రిషనే తీసుకోవాలని దిల్ రాజు భావిస్తున్నాడు. ఇక హీరోని వెతుకుతున్న టైంలో ఈ సినిమాలో హీరోగా నేను నటిస్తానని రానా ముందుకు వచ్చాడట. తెలుగు వెర్షన్ లో కూడా త్రిషనే హీరోయిన్ అని తెలవడంతో నేనే హీరోగా చేస్తానని రానా ముందుకి వచ్చాడట. మరి దిల్ రాజు ఇందుకు ఒప్పుకుంటారో? లేదో చూడాలి. దిల్ రాజు మనసులో వేరే హీరో ఉన్నారా అనేది తెలియాల్సి ఉంది. లేదా రానా మాట కాదనలేక అతడినే పెట్టి సినిమా చేస్తాడా అనేది తెలియాలి.