గత నాలుగైదు రోజుల నుండి సవ్యసాచి విలన్, అమ్మాయిల కలల రాకుమారుడు తమిళ హీరో మాధవన్ మళ్ళీ తెలుగులో విలన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడని.. ఇప్పటికే ఆ సినిమా కథలోని తన కేరెక్టర్ నచ్చిన మాధవన్ ఆ చిత్ర బృందానికి ఓకె చెప్పెయ్యబోతున్నాడనే ప్రచారం అట్టా... ఇట్టా జరగాలా. ఇంతకీ మాధవన్ మళ్ళీ విలన్ గా చెయ్యబోయే ఆ హీరో సినిమా ఏదో ఈపాటికే మీరు గెస్ చేసేసి ఉండాలి. అవును.. రవితేజ - విఐ ఆనంద్ కలయికలో తెరకెక్కబోతున్న సినిమా కోసం మాధవన్ ని విలన్ రోల్ కోసం సంప్రదించారని న్యూస్ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేసింది. ప్రస్తుతం వరస ప్లాప్స్ లో ఉన్న రవితేజ కి విలన్ గా మాధవన్ నటిస్తే ఆ సినిమాకి ఆటోమాటిక్ గా క్రేజ్ వస్తుందని ప్రచారం జరిగింది. అందుకే మాధవన్ కోసం రవితేజ - విఐ ఆనంద్ స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు కూడా జరుగుతూన్నాయని అన్నారు. ఒకానొక టైం లో విఐ ఆనంద్ - రవితేజ సినిమా ఆగి పోయిందని న్యూస్ వచ్చింది. కానీ హీరో రవితేజ మాత్రం అలాంటిదేం లేదు విఐ ఆనంద్ సినిమా ఉందని క్లారిటీ ఇచ్చాడు.
తాజాగా తనకు తెలుగులో మళ్ళీ విలన్ గా చెయ్యబోతున్న సినిమాపై హీరో మాధవన్ కూడా స్పందించాడు. తాను రవితేజ - విఐ ఆనంద్ కలయికలో తెరకెక్కబోయే సినిమాలో విలన్ గా నటిస్తున్నాని వస్తున్న వార్తల్లో నిజం లేదని.. అవి కేవలం రూమర్స్ మాత్రమే అని కొట్టిపారేశాడు. తాను ప్రస్తుతం తెలుగులో అనుష్క తో కలిసి సైలెన్స్ అనే సినిమా లో నటిస్తున్నాని చెప్పాడు. అయితే ఇప్పుడు మాధవన్, రవితేజ - విఐ ఆనంద్ సినిమాలో నటించడం లేదని తేలిపోయింది. మరి మాధవన్ విలన్ అని ప్రచారం జరిగిన ఆ సినిమాలో తమిళ నటుడు బాబీ సింహ విలన్ గా నటించే ఛాన్స్ ఉందట. రామ్ తాళ్లూరి నిర్మాణంలో తెరకెక్కబోయే ఈ చిత్రంలో రవితేజ సరసన ముగ్గురు హీరోయిన్స్ నటించబోతున్నారు. ఇక ఈ సినిమా త్వరలోనే ప్రారంభం కాబోతుందనేది లేటెస్ట్ న్యూస్.