అమెరికా సెక్స్ రాకెట్ లో టాలీవుడ్ హీరోయిన్ రెజినా పేరు గత కొన్ని రోజులు నుండి సోషల్ మీడియాలో వస్తుంది. అయితే ఎట్టకేలకు రెజినా దానిపై స్పందించింది. తనకు సంబంధం లేని విషయంలో నన్ను అనవసరంగా లాగొద్దని తన ఆవేదన వ్యక్తం చేసింది. ప్రతి విషయం గురించి ఎందుకు అనవసరంగా స్పందించడం అని ఇప్పుటి వరకు స్పందించ లేదు అని పేర్కొంది.
ఒకరి గురించి మాట్లాడే ముందు వాస్తవాల్ని తెలుసుకుని మాట్లాడాలని సూచించింది. తనకు ఏ మాత్రం సంబంధం లేని అమెరికా సెక్స్ రాకెట్ విషయంలో నన్ను లాగడంతో చాలా బాధగా ఉందని.. ఏదైనా మాట్లాడే ముందు అన్నీ తెలుసుకుని మాట్లాడాలని పేర్కొంది. అవసరం అయితే అడిగితే అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతానని రెజినా వివరించింది.
పలువురు హీరోయిన్ల పేర్లు
లేటెస్ట్ గా అమెరికాలో సెక్స్ రాకెట్ బయటపడటంతో టాలీవుడ్ కి సంబంధించి చాలామంది హీరోయిన్స్ పేర్లు బయటికి వచ్చాయి. ఇండియా నుండి అమెరికాలో సాంస్కృతిక కార్యక్రమాల పేరుతో టాలీవుడ్ హీరోయిన్స్ ని తీసుకెళ్లి అక్కడ వారితో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు తెలిసిన విషయమే. కిషన్ మోదుగుమూడి అనే వ్యక్తి దీనికి ప్రధాన సూత్రధారి.