నేను పెళ్లికి రెడీ అంటూ ఇండైరెక్ట్ గా చెబుతుంది పవన్ రెండో భార్య రేణు దేశాయ్. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్ ఉండే ఆమె లేటెస్ట్ గా ఒక ఫోటోను పెట్టి సందేశం ఇచ్చిన తీరు చూస్తుంటే ఇప్పుడు అది చర్చకు దారి తీసేసాల ఉంది. కారణం అందులో ఆమె పోస్ట్ చేసిన ఫోటో మరియు సందేశం. పేరు ప్రస్తావించకపోయినా ఒక చేతిని గట్టిగా ఒడిసి పట్టుకున్నట్టు పోస్ట్ చేసిన ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఇన్నాళ్లు ప్రేమ కోసం ఎక్కడెక్కడో తిరిగాను. కవిత్వంలోనే చూసుకున్నాను. కొన్ని సార్లు క్యాండెల్ లైట్ డిన్నర్, ప్రేమగా మాట్లాడుకునే మాటలు చూశాను. ప్రేమను వర్షంలో, పాటల్లో, సుదూర ప్రయాణాల్లో చూడాలని ఉంది. వర్షంలోనూ..పాటల్లోనూ మన ప్రేమను చూడాలని ఉంది. కానీ అది వందలాది రోజా పువ్వులున్న బొకేలో ఉంటాయనుకున్నాను. అటువంటి ప్రేమ నాకు నీలో దొరికింది. చిన్న చిన్న కదలికల్లో, నిజాయితీ ఉన్న చేతల్లో, నమ్మకమైన మాటల్లో నీలో నేను చూసాను. నువ్వు నాకు అద్దం. నీ తోడులో ఆనందం, శాంతి, దయాగుణం ఇవన్నీ తెలిసొస్తున్నాయి. నా చెయ్యి పట్టుకో. ఎన్నటికీ వదలనివ్వను. అజరామరమైన శాంతిని నాకు సాధ్యం చేసి చూపించావు అని కవిత రూపంలో సందేశం ఇచ్చింది రేణు.
ఈ కవితం బట్టి చూస్తుంటే రేణు దేశాయ్ ప్రేమలో ఉన్నట్టు అర్ధం అవుతుంది. గతంలో రెండో పెళ్లి చేసుకుంటాను అన్న మాటకే పవన్ కళ్యాణ్ ఫాన్స్ తో సోషల్ మీడియా మాటలు పడ్డ రేణు దేశాయ్ మొత్తానికి రెండో పెళ్ళికి సిద్ధపడుతోంది. మరి దీనిపై పవన్ ఫ్యాన్స్ ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి. పవన్ మూడవ పెళ్లి చేసుకున్నప్పుడు రేణు తన లైఫ్ పాట్నర్ ని వెతుకుంటే తప్పేంటి?