RX 100 అంటే ఏదో సినిమా వస్తుంది లే అనుకున్నారు అంతా. ఇదీ చిన్న సినిమానే... ఏవో చాలా చిన్న సినిమాల్లానే రెండ్రోజులు హడావిడి చేసి వెళ్ళిపోతుంది అని అనుకున్నారు. ఎందుకంటే సినిమా మీద విడుదలకు ముందు ఏమాత్రం బజ్ కూడా లేదు. అసలు RX 100 అంటే ఎవరికైనా అర్ధమయితేనే కదా... సినిమా మీద క్రేజ్ రావడానికి. అలా విడుదలైన RX 100 సినిమా విడుదలైన మూడో రోజు నుండి తన విశ్వరూపం చూపించింది. తనతో విడుదలైన విజేత, చినబాబు సినిమాలకు చుక్కలు చూపించింది. అలా వారం రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా 8 కోట్లు కొల్లగొట్టింది. ఇక తర్వాతి వారం మూడు నాలుగు సినిమాలున్నాయి. ఇక RX 100 పనైపోయింది అనుకుంటే... గత వారం విడుదలైన లవర్, వైఫ్ ఆఫ్ రామ్, పరిచయం, ఆటగదరా శివ సినిమాలు ఫ్లాప్ అయ్యేసరికి మళ్లీ RX పుంజుకుంది. ఈ 11 రోజుల్లో RX 100 అనూహ్యంగా 10 కోట్లను ప్రపంచ వ్యాప్తంగా సొంతం చేసుకుంది. మరి లోబడ్జెట్ లో తెరకెక్కిన RX 100 ఇలా రెండింతల లాభాలతో అదరగొట్టే కలెక్షన్స్ తో ఇప్పటికీ దూసుకుపోతుంది.
నైజామ్ 4.54
సీడెడ్ 1.14
ఉత్తరాంధ్ర 1.3
గుంటూరు 0.60
ఈస్ట్ గోదావరి 0.72
వెస్ట్ గోదావరి 0.57
కృష్ణా 0.60
నెల్లూరు 0.23
ఏపీ అండ్ టీఎస్ షేర్ 9.43 కోట్లు
ఇతర ప్రాంతాలు 0.38
ఓవర్సీస్ 0.35
వరల్డ్ వైడ్ షేర్ 10.16 కోట్లు