సాహో టీజర్ లో ఆ సీన్ గురించే మాట్లాడుకుంటున్నారు

నిన్నటి నుండి ఇండియా మొత్తం ‘సాహో’ చిత్రం గురించే మాట్లాడుకుంటున్నారు. నిన్న రిలీజ్ చేసిన సాహో టీజర్ కి అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో ఈ మేనియా నుండి [more]

Update: 2019-06-14 09:43 GMT

నిన్నటి నుండి ఇండియా మొత్తం ‘సాహో’ చిత్రం గురించే మాట్లాడుకుంటున్నారు. నిన్న రిలీజ్ చేసిన సాహో టీజర్ కి అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో ఈ మేనియా నుండి బయటకి రాలేకపోతున్నారు. ఇండియన్ స్క్రీన్ మీద ఇంతకుముందెన్నడూ చూడని రసవత్తర యాక్షన్ ఘట్టాలతో ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించబోతోందని సాహో టీజర్ చూస్తే అర్థమైంది. యాక్షన్ అడ్వెంచరస్ గా తెరకెక్కిన ఈచిత్రం లో ప్రభాస్ చాలా కొత్తగా కనిపించనున్నాడు. ఇందులో వావ్ అనిపించే షాట్లు ఎన్నో ఈ టీజర్లో కనిపించాయి. ముఖ్యంగా టీజర్ లో ప్రభాస్ బైక్ మీద వెళ్తుంటే వెనకాల ఓ వ్యాన్..దాని వెనుక ఒక ట్రక్ దూసుకొచ్చి అతడి మీద పడబోయే షాట్ గురించి చాలామంది మాట్లాడుకుంటున్నారు.

అయితే ఈ సీన్ గురించి ఎప్పటినుండో టాలీవుడ్ లో చర్చ జరుగుతుంది. ఈ యాక్షన్ సీన్ ని దుబాయ్‌లోని ఒక భారీ ఫ్లై ఓవర్ మీద షూట్ చేసారు. దాదాపు రూ.90 కోట్లు పెట్టి తీసిన యాక్షన్ సీన్ టీజర్ లో ఒకట్రెండు క్షణాలే కనిపించిన సినిమాలో మాత్రం పావు గంటకు పైగా ఉంటుందట. ఈ యాక్షన్ సీక్వెన్స్ విజువల్ ఐ ఫిస్ట్ గా ఉండబోతుందని అర్ధం అయిపోతుంది. దీని కోసం వందల మంది కొన్ని నెలల పాటు కష్టపడ్డారు.హాలీవుడ్ ఫైట్ మాస్టర్ కెన్నీ బేట్స్ ఎంతో శ్రమించి ఈ యాక్షన్ ఎపిసోడ్ డిజైన్ చేశాడు. ఇదే కాదు సినిమాలో వావ్ అనిపించే సీన్స్ చాలానే ఉన్నాయి అంట. ప్రభాస్ సరసన శ్రద్ద కపూర్ నటిస్తున్న ఈసినిమా ఆగష్టు 15 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవ్వబోతుంది.

Tags:    

Similar News