కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ తో ఇరగదీసిన సాయి పల్లవి..!
గార్గి సినిమా సాంకేతికంగా కూడా గొప్పగా ఉంది. గోవింద్ వసంత సంగీతం అందించిన ఈ చిత్రం సినిమాలోని
సాయి పల్లవి తన అసాధారణ నటనతో ఎంతో మంచి పేరు తెచ్చుకుంటూ ఉంది. ఆమె నటించిన ప్రతి సినిమా లోనూ ఆమె పాత్ర హైలైట్ గా నిలిచింది. ఆమె కొత్త చిత్రం, గార్గిలో కూడా సాయి పల్లవి సూపర్ గా నటించిందని చెబుతూ ఉన్నారు.గౌతం రామచంద్రన్ తీసిన 'గార్గి' సినిమాలో సాయి పల్లవి.. న్యాయం కోసం కూతురు చేసే పోరాటం గురించి చూపించారు. అత్యాచారం కేసులో ఐదవ ముద్దాయి అయిన తన తండ్రి బ్రహ్మానందం (RS శివాజీ)ని రక్షించడానికి తీవ్రంగా ప్రయత్నించే కుమార్తె (గార్గి) పాత్రను పోషించింది సాయి పల్లవి. ఈ సినిమాను తమిళంలో సూర్య - జ్యోతిక దంపతులు.. తెలుగులో దగ్గుబాటి రానా సమర్పించారు.
గార్గి సినిమా సాంకేతికంగా కూడా గొప్పగా ఉంది. గోవింద్ వసంత సంగీతం అందించిన ఈ చిత్రం సినిమాలోని పాత్రలతో పాటు భావోద్వేగాలను కూడా ఆకట్టుకుంటుంది. నేటి కాలంలో చాలా సందర్భోచితంగా ఉన్న సినిమా పరంగా గార్గి తప్పక చూడవలసిన చిత్రం. సాయి పల్లవి, కాళి వెంకట్, కలైమామణి శరవణన్, ఆర్.ఎస్ ఐశ్వర్యలక్ష్మి, జయప్రకాశ్ తదితరులు నటించిన సినిమా ఈ వీకెండ్ తప్పకుండా చూడాల్సిన సినిమా..! అత్యాచారినికి గురైన బాలిక తండ్రిగా కలైమామణి శరవణన్ తనదైన నటనతో కంటతడి పెట్టించాడు. ఈ సినిమాకు మరో ప్రధాన బలం గోవింద్ వసంత నేపథ్య సంగీతం. ఎడిటింగ్ బాగుంది. సినిమాటోగ్రఫి పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి.