బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కూతురిపై కేసు వేశాడు ‘కేదార్నాథ్’ మూవీ డైరెక్టర్. తనకి 5 కోట్లు నష్ట పరిహారం ఇవ్వాలన్నది ఆ డైరెక్టర్ డిమాండ్. అసలు మ్యాటర్ లోకి వెళ్తే.. సారా - సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ కలిసి అభిషేక్ కపూర్ డైరెక్షన్ లో ‘కేదార్నాథ్’ అనే మూవీ చేస్తుంది. కొన్నిరోజులు పాటు ఈ సినిమా షూటింగ్ జరిగింది. ఈలోగా ప్రొడ్యూసర్స్ తో విబేధాలు కారణంగా ఈ సినిమా ప్రస్తుతం ఆగిపోయింది.
బాంబే హైకోర్టులో...
అయితే ఈ విషయం తెలుసుకున్న సైఫ్ అలీఖాన్ తన కూతురు భవిషత్తు బాగుండేందుకు సారాకు మరో సినిమాలో ఛాన్స్ ఇప్పించాడు సైఫ్. 'సింబా' అనే మూవీ ఛాన్స్ ఇప్పించాడు. ఇందులో రణ్వీర్ సింగ్ కి జోడిగా సారా నటిస్తుంది. అయితే ఈ విషయం తెలుసుకున్న ‘కేదార్నాథ్’ డైరెక్టర్ ఆమెపై కేసు వేశాడు. అగ్రిమెంట్ ప్రకారం ‘కేదార్నాథ్’ పూర్తయ్యేవరకు సారా మరే సినిమాలో నటించకూడదు అని కానీ సారా వేరే సినిమాలో యాక్ట్ చేయడంతో డైరెక్టర్ అభిషేక్కపూర్ బాంబే హైకోర్టుని ఆశ్రయించాడు. అయితే మరి ఈ వ్యవహారం ఎంతవరకు వెళ్తుందో చూడాలి.