సల్మాన్ ఖాన్ కు ఆయుధాల లైసెన్స్ జారీ

దాదాపు నెల రోజుల క్రితం లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుండి సల్మాన్ కు బెదిరింపులు వచ్చాయి.

Update: 2022-08-01 06:58 GMT

ఇటీవల బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు వచ్చిన బెదిరింపు లేఖల నేపథ్యంలో స్వీయ రక్షణ కోసం తుపాకీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఆయుధాల లైసెన్స్ జారీ చేసినట్లు ముంబై పోలీసులు తెలిపారు. మే 29న పంజాబ్‌లోని మాన్సా సమీపంలో గాయకుడు సిద్ధూ మూస్ వాలాను కాల్చి చంపిన కొద్ది రోజులకే, జూన్ ప్రారంభంలో సల్మాన్ ఖాన్, అతని తండ్రికి బెదిరింపు వచ్చింది.

తాజాగా బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు తుపాకీ లైసెన్స్ మంజూరు చేశారు. సల్మాన్ కు కొన్ని గ్రూపుల నుంచి ముప్పు ఉన్న సంగతి తెలిసిందే. దీంతో తన ప్రాణాలకు ముప్పు ఉందని, గన్ లైసెన్స్ మంజూరు చేయాలని కోరుతూ సల్మాన్ ఖాన్ దరఖాస్తు చేసుకున్నాడు. జులై 22న ముంబై పోలీసు కమిషనర్ ను కలుసుకున్నాడు. సల్మాన్ ఖాన్ నివాసం ఉండే డీసీపీ జోన్ 9కు ఆయుధ లైసెన్స్ దరఖాస్తును పంపించారు. జోనల్ డీసీపీ నిరభ్యంతరం వ్యక్తం చేయడంతో లైసెన్స్ మంజూరైంది.
దాదాపు నెల రోజుల క్రితం లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుండి సల్మాన్ కు బెదిరింపులు వచ్చాయి. ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్ తుపాకీ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. స్వీయ రక్షణ కోసం నటుడికి తుపాకీ జారీ చేయబడింది. ఇక బెదిరింపుల కారణంగా సల్మాన్ తన వాహనాలను కూడా అప్గ్రేడ్ చేసుకుంటూ ఉన్నారు. తాజాగా ల్యాండ్ క్రూయిజర్‌ ను సల్మాన్ తీసుకున్నాడని వార్తలు వచ్చాయి. బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ అమర్చినట్లు తెలుస్తోంది. సల్మాన్ ఖాన్ లైసెన్స్‌ని ఆయన ప్రతినిధి ఒకరు సేకరించారు. లైసెన్సు జారీలో తగిన ప్రక్రియను అనుసరించినట్లు తెలిసింది. నటుడికి తుపాకీ లైసెన్స్ జారీ చేయడానికి ముందు సల్మాన్ ఖాన్ నేర చరిత్ర, నేపథ్యాన్ని తనిఖీ చేశారు. సల్మాన్, అతని తండ్రికి భద్రతను కూడా కట్టుదిట్టం చేశారు. సల్మాన్ సినిమా సెట్స్‌పై భద్రతను కూడా కట్టుదిట్టం చేశారు.


Tags:    

Similar News