అక్కినేని నాగచైన్య - సమంత... ప్రస్తుతం టాలీవుడ్ లో క్యూటెస్ట్ కపుల్. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట వైవాహిక జీవితాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా, వారి మధ్య ప్రేమ ఎలా చిగురించిందో ఇద్దరూ ఆసక్తికరంగా చెప్పారు. రాహుల్ రవింద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన చి.ల.సౌ సినిమా ప్రమోషన్స్ లో ఈ జంట పాల్గొంది. దీంతో సమంతకు ఎలా ప్రపోజ్ చేశారని నాగచైతన్యను రాహుల్ అడిగాడు. ‘‘ఏ మాయ చేసావే సినిమా చేసి పదేళ్లవుతుంది. ఏడేళ్ల నుంచి సమంతను ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను’’ అని నాగ చైతన్య చెప్పాడు. దీనికి కౌంటర్ ఇచ్చిన సమంత...‘‘నాగ చైతన్య చుట్టూ ఎంతోమంది అమ్మాయిలు తిరిగేవారు, ఏడేళ్ల తర్వాత నా టోకెన్ నెంబర్ వచ్చింది’’ అని వ్యాఖ్యనించి అందరినీ నవ్వించింది. వీరిద్దరి ప్రేమ ముచ్చట్లు విని ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు.