అందమైన రూపం వెనుక.. ఇంత విలనిజమా?

టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత అందం వెనుక ఆమె కష్టం దాగుంది. ఎప్పుడూ జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ శరీరాన్ని అందంగా మలుచుకుని.. పెళ్లి తర్వాత కూడా [more]

Update: 2020-09-28 07:30 GMT

టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత అందం వెనుక ఆమె కష్టం దాగుంది. ఎప్పుడూ జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ శరీరాన్ని అందంగా మలుచుకుని.. పెళ్లి తర్వాత కూడా సమంత టాప్ రేంజ్ లో దూసుకుపోతుంది. ఇప్పటికి సమంత కి వరస అవకాశాలు వస్తున్నాయంటే ఆమె అందం కారణం.ఇక సినిమా ఈవెంట్స్ కానివ్వండి, ఏదైనా ప్రవేట్ ఫంక్షన్స్ కానివ్వండి, అవార్డ్స్ వేడుక కానివ్వండి సమంత చాలా అందమైన డ్రెస్సుల్తో.. గ్లామర్ గా అదరగొడుతూ అందరి చూపు తన వైపే ఉండేలా చూసుకుంటుంది. ఇక ఆమె కృషి పట్టుదలే ఆమె ఎదుగుదలకు కారణం కూడా. అయితే అంత అందమైన మొహం వెనుక అంట పెద్ద విలనిజం దాగుందా అంటారేమో. ఎందుకంటే సమంత ఓ విలన్ కేరెక్టర్ లో నటించేసింది.

బాలీవుడ్ లో ద ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ లో సమంత నెగెటివ్ షేడ్స్ ఉన్న కేరెక్టర్ లో నటించింది అనే ప్రచారం ఉంది. అయితే ఆ కేరెక్టర్ ఏమిటనేది ఎవరికీ తెలియలేదు. అయితే సమంత ఈ వెబ్ సీరీస్ లో పాకిస్తాన్ టెర్రరిస్ట్ గా నటించింది అనేది లేటెస్ట్ న్యూస్. మరి పాకిస్తాన్ టెర్రరిస్ట్ లు ఎలా ఉంటారనేది మనం బోలెడన్ని సినిమాల్లోనూ, ఇండియా మీద పాక్ కుట్రల్లోనూ చూస్తూనే ఉన్నాం. మరి సమంత లాంటి అందమైన అమ్మాయి ఇలా టెర్రరిస్ట్ లా కనిపిస్తుంది అంటే అభిమానుల గుండె పగలడం ఖాయం. మరి పాకిస్తానీ టెర్రరిస్ట్ గా సమంత ని ఒక్కసారి ఊహించుకోండి. అమ్మో అనిపించడం లేదూ.!

Tags:    

Similar News