అవకాశాలు రావడం లేదా..వచ్చినా వద్దంటుందా..!

Update: 2018-09-28 06:27 GMT

ప్రస్తుతం పెళ్లయిన హీరోయిన్స్ కి సినిమా అవకాశాలు తగ్గుతాయని నానుడిని బ్రేక్ చేసింది సమంత. నాగ చైతన్య తో ప్రేమలో ఉన్న సమంతకి గత ఏడాది పెద్దగా అవకాశాలే రాలేదు. అలాంటి టైంలోనే రామ్ చరణ్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన రంగస్థలం సినిమాలో ఆఫర్ రావడం.. ఆ సినిమా షూటింగ్ లో ఉండగానే సమంత - నాగ చైతన్యల పెళ్లి కావడం జరిగిపోయాయి. అయితే పెళ్లి తర్వాత సమంతకు స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు రావడం తగ్గాయి. అదే టైంలో సమంత ప్రాధాన్యత ఉన్న పాత్రలకే ఓకె చెప్తానని చెప్పడం.. ఆ తర్వాత మహానటి సినిమా చెయ్యడం జరిగాయి. ఇక పెళ్లి తర్వాత విడుదలైన రంగస్థలం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇక అదే సమంత స్టార్ హీరోతో చేసిన చివరి సినిమా. ఇక తమిళంలో అభిమన్యుడిలో విశాల్ హీరోగా చేయగా అది హిట్ అయ్యింది. తర్వాత మొన్న చేసిన సీమరాజా ఫ్లాప్. ఇక తెలుగులో లేడి ఒరింటెడ్ సినిమాగా వచ్చిన యూ-టర్న్ హిట్ అయ్యింది.

సమంత అనగానే...

మరి సమంతకి స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు రాకపోవడానికి కారణం మాత్రం స్టార్ హీరోలెవరు అక్కినేని కోడలితో రొమాన్స్ చెయ్యాలనుకోకపోవడమే అంటున్నారు. ఇంతకుముందు నాగచైతన్యతో సమంత ప్రేమలో ఉన్నప్పుడే ఇలాంటి ప్రచారం జరిగింది. సమంత హీరోయిన్‌ అని దర్శకులు సజెస్ట్‌ చేసినా కానీ చాలా మంది హీరోలు వద్దని చెప్పేస్తున్నారు... నాగ చైతన్యతో హీరోలకు ఉన్న స్నేహం కావచ్చు.. అలాగే టాలీవుడ్ లో సీనియర్ హీరో నాగార్జునపై గౌరవం కావచ్చు అంటూ ప్రచారం జరిగింది. ఇక సమంత ఎప్పుడు గ్లామర్ పాత్రలకు నో అని చెప్పలేదు కానీ... ప్రాధాన్యమున్న పాత్రలు అనేసరికి చాలామంది సమంతని లైట్ తీసుకునుండొచ్చు.

గ్లామర్ షో కు రెడీ అంటోందా..?

ఇకపోతే సమంత మాత్రం గ్లామర్ పాత్రలకు సై అని చెప్పడం లేదని.. గ్లామర్ కి బై బై చెప్పేస్తుంది అనుకునే లోపు.. చైతుతో వెకేషన్స్ లో ఉన్న సమంత టు పీస్ బికినీ తో హాట్ అందాలతో అదరగొట్టే పిక్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. మరి సమంత ఉద్దేశ్యం ఏమిటి స్టార్ హీరోల సినిమాల్లో గ్లామర్ షో చేస్తానని చెబుతుందా... లేదంటే ఇక గ్లామర్ షో ఎందుకులే హీరోయిన్ ప్రాధాన్యత పాత్రలు మాత్రమే చేద్దామనుకుంటుందా అనేది క్లారిటీ రావడం లేదు. ఎందుకంటే నందిని రెడ్డి చెయ్యబోయే సినిమాలో సమంత లేడి ఓరియెంటెడ్ సినిమా కాబట్టే ఒప్పుకుందంటూన్నారు. మరో పక్క స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు రాకపోవడంతోనే సమంత ఇలా యూ-టర్న్ తీసుకుందనే టాక్ బయలు దేరింది. మరి అసలు సమంతకి అవకాశాలు రావడం లేదా... నిజంగా వచ్చినా వద్దంటుందా అనేది అర్ధమవ్వడం లేదు.

Similar News