అక్కినేనివారి ముద్దుల కోడలు ఆ ఫ్యామిలీకి సంబంధించిన ఒక ముఖ్యమైన అకేషన్ లో మిస్ అయ్యింది. గత ఏడాది అక్కినేని ఇంటి కోడలిగా సగర్వంగా అడుగుపెట్టిన సమంత ఆ ఫ్యామిలీలో ఇట్టే కలిసిపోయింది. సమంత ని అక్కినేని కుటుంబ సభ్యులంతా ప్రేమతో చూస్తున్నారు. కలుపుగోలు మనిషి కావడంతో సమంత కూడా అందరితో బాగా కలిసిపోయింది. ఇక నాగార్జున.. కోడలా అని పిలవడం, అఖిల్ కూడా ముద్దుగా వదిన గారు అనడం సమంత మీద చూపిస్తున్న ప్రేమకు నిదర్శనం. అయితే ప్రస్తుతం అక్కినేని నాగార్జున - అమల లు తమ వెడ్డింగ్ యానివర్సరీని కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా జరుపుకున్నారు.
కుటుంబసభ్యుల నడుమ...
జూన్ 10 న నాగ్ - అమలలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మరి పెళ్లినాటి నుండి నాగార్జున - అమల లు ఎంతో ప్రేమగా అన్యోన్యంగా ఉన్నారో ఎప్పటికప్పుడు వారు తెలియజెబుతూనే ఉన్నారు. ఇక జూన్ పదిన పెళ్లిరోజు వేడుకలు జరుపుకున్ననాగ్, అమల కుటుంబ సభ్యుల మధ్య విందు చేశారు. అక్కినేని నాగేశ్వరరావు కూతుళ్లు, కొడుకులు, మనవళ్లు, మనవరాళ్ల మధ్యలో నాగ్, అమల తమ పెళ్లి రోజు వేడుకలు జరుపుకున్నారు. ఈ వేడుకలకి నాగ చైతన్య, అఖిల్ హైలెట్ కాగా. సుమంత్, సుశాంత్ అందరూ నాగ్ జంటకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసారు. కంప్లీట్ ఫ్యామిలీ అంతా హాజరయిన ఈ వేడుకలో అక్కినేని సమంత మాత్రం మిస్ అయ్యింది.
పాపం మిస్సయిందే...
ప్రస్తుతం నాగ్ - అమల ల పెళ్లి రోజు వేడుకల ఫొటోలు నెట్ లో వైరల్ అయ్యాయి. ఆ ఫొటోలో సమంత మిస్ అవడంతో... ఆమె ఎక్కడికి వెళ్ళింది, ఎందుకు ఈ వేడుకలకి దూరమైంది అంటూ తెగ చర్చించుకుంటున్నారు. మరి సమంత ఏ కారణం చేత ఈ వేడుకకి దూరమైందో కానీ.. అక్కినేని ఫ్యామిలీ లో ఇంపార్టెంట్ అకేషన్ ని పాపం సమంత మిస్ అయ్యిందంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పడిపోతున్నాయి.