తమిళంలో స్టార్ హీరోలతో, కుర్ర హీరోలతో జోడి కడుతూ.. మంచి స్క్రిప్ట్ వస్తే లేడి ఒరింటెడ్ చిత్రాలతో చెలరేగిపోయి స్టార్ హీరోల సినిమాలతో సమానంగా కలెక్షన్స్ కొల్లగొట్టగల శక్తి కేవలం ఒక్క నయనతార కే ఉంది. లేడి ఓరియెంటెడ్ చిత్రాలకు నయనతారకు ఉన్న ఫాలోయింగ్ తర్వాతే ఏ హీరోయిన్ అయినా అనే రేంజ్ లో నయనతార ఉంటుంది. ఇక తెలుగులో అలా లేడి ఓరియెంటెడ్ చిత్రాలతో అనుష్క శెట్టి ముందుంటుంది. అరుంధతి, రాణి రుద్రమదేవి.. నిన్నగాక మొన్నొచ్చిన భాగమతి కానివ్వండి... లేడి ఓరియెంటెడ్ చిత్రాలకు అనుష్క పర్ఫెక్ట్ అనే రేంజ్ లో ఆమె సినిమాల కలెక్షన్స్ కూడా ఉంటాయి.
సినిమా హిట్ అయినా...
కానీ వారిలా స్టార్ హీరోయిన్ అయిన సమంత లేడి ఓరియెంటెడ్ చిత్రంతో విజయం సాధించలేక చతికిల పడింది. ఈ ఏడాది రంగస్థలం, మహానటి, అభిమన్యుడు చిత్రాలతో హిట్స్ కొట్టిన సమంత... తనకెంతో ఇష్టమైన యూ-టర్న్ సినిమాని తెలుగులో రీమేక్ చేసింది. ఈ సినిమాలో జర్నలిస్ట్ గా సమంత నటన ఆసాంతం అద్భుతం. పవన్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన యూ-టర్న్ కి సూపర్ హిట్ టాక్ వచ్చింది. సినిమా కూడా హిట్. సమంత హాట్ హాట్ గా డాన్స్ స్టెప్స్ తో అలరించింది కూడా. సినిమా సూపర్ హిట్ కానీ కలెక్షన్స్ నిల్. మరి సమంతకి ఈ లేడి ఓరియెంటెడ్ పాత్రలు కలిసి రావా.. ఆమె కేవలం స్టార్ హీరోల పక్కన మాత్రమే నటిస్తే క్రేజ్ ఉంటుందా.. సోలోగా క్రేజ్ లేదా అంటూ సోషల్ మీడియాలో సమంతపై కామెంట్స్ పడుతున్నాయి.
సమంత క్రేజ్ సరిపోదా..?
ఎందుకంటే సమంత క్రేజ్ ని చూసే యూ-టర్న్ కి మంచి బిజినెస్ జరిగింది. తీరా చూస్తే క్లోజింగ్ కలెక్షన్స్ తో యూటర్న్ డిజాస్టర్ లిస్ట్ లోకి వెళ్లింది. మరి దీన్నిబట్టి సమంత క్రేజ్ యూ-టర్న్ కి సరిపోలేదు గనకే.. సినిమా కలెక్షన్స్ అలా ఉన్నాయంటున్నారు. అయితే యూ-టర్న్ ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేదు... ఫలితంగా నష్టాలు వచ్చాయి. కాబట్టే ఇక లేడీ ఓరియెంటెడ్ సినిమాలపై సమంత ఆసక్తి చూపకపోవచ్చనే టాక్ సోషల్ మీడియాలో వినబడుతుంది. మరి ప్రాధాన్యం ఉన్న పాత్రలు చెయ్యాలంటే ఇలా లేడి ఓరియెంటెడ్ చిత్రాలైతేనే కరెక్ట్. కానీ సమంతకి ఉన్న స్టామినా వాటికి సరిపోవడం లేదే.