భర్త విషయంలో బాధపడుతున్న సమంత..?

Update: 2018-09-21 06:46 GMT

నాగ చైతన్య ని పెళ్లాడిన హీరోయిన్ సమంత అక్కినేని కోడలిగా బరువు బాధ్యతలు పెరిగాయని.. సందర్భం వచ్చినప్పుడల్లా చెబుతూనే ఉంది. ఇక హీరోయిన్ గా సమంత కెరీర్ లో పెళ్లి తర్వాత కూడా దూసుకుపోతుంటే.. నాగ చైతన్యకు మాత్రం పెళ్లికి ముందు పరిస్థితే పెళ్లి తర్వాత కూడా కంటిన్యూ అవుతుంది. అయితే ఈ వినాయక చవితికి సమంత యూ-టర్న్ మీద పోటీగా శైలజారెడ్డి అల్లుడు సినిమాని విడుదల చేసాడు. మరి ఒకే రోజు భార్య భర్తలు తమ తమ సినిమాలతో పోటీ పడటం అనేది ఏ భాషలోనైనా చాలా అరుదుగా జరుగుతుంది. రెండు వేర్వేరు జోనర్స్ తో తెరకెక్కిన ఈ సినిమాలు సెప్టెంబర్ 13న విడుదలయ్యాయి.

సినిమా హిట్ అయినా...

సమంత యూ-టర్న్ సినిమాకి హిట్ టాక్ రావడం, చైతన్య శైలజారెడ్డి అల్లుడుకి యావరేజ్ టాక్ రాడమే కాదు... నెగెటివ్ రివ్యూలు కూడా వచ్చాయి మరి భర్త మీద భార్య హిట్ కొట్టడం అనేది ఏ భార్యకైనా బాధ వేసే విషయమే. ఇక భార్య మీద భర్త హిట్ కొడితే అందులో పెద్దగా విషయం ఉందని అనిపించదు. అయితే తన సినిమా హిట్ అయినప్పటికీ.. సమంత హ్యాపీగా లేదట. ఈ విషయాన్ని గత రాత్రి జరిగిన దేవదాస్ ఆడియో వేడుకలో సమంత మామ దేవదాస్ హీరో నాగార్జున రివీల్ చేసాడు. సమంతకి యూ-ట‌ర్న్‌ బాగుంద‌న్న సంతోషం కంటే.. శైల‌జారెడ్డి అల్లుడు సినిమాకి నెగిటీవ్ రివ్యూలు వ‌చ్చాయ‌న్న బాధే ఎక్కువ క‌నిపించింద‌ని చెబుతున్నాడు నాగ్.

భయటపెట్టిన నాగ్

భార్యాభర్తల సినిమాలు ఒకే రోజు విడుద‌ల అవ్వ‌డం నేనెప్పుడూ చూడ‌లేదు. అయితే ఆ రెండు సినిమాలు ఒకే రోజు విడుదలై బాగా ఆడాయి. అయితే ఆ రోజు ఉద‌యం శైల‌జారెడ్డి అల్లుడు రివ్యూలు చూసి స‌మంత బాధ ప‌డింది. మ‌రేం ఫ‌ర్వాలేదు వ‌సూళ్లు బాగుంటాయి అన్నాను. నేను అన్న‌ట్టే శైల‌జారెడ్డికి మంచి వ‌సూళ్లు ద‌క్కాయి. యూ-ట‌ర్న్ రివ్యూలు బాగున్నా వ‌సూళ్లు స‌రిగా లేవు. ఆదివారం నాటికి వ‌సూళ్లు పెరుగుతాయి అని చెప్పా. అన్న‌ట్టుగానే వ‌సూళ్లు పెరిగాయి. సెప్టెంబ‌రు మాకు బాగా క‌లిసొచ్చింది. ఈ సెప్టెంబ‌రులోనే వ‌స్తున్న దేవ‌దాస్ ఓ పండ‌గ‌లా ఉంటుంది... అంటూ నాగ్ సమంత బాధను అభిమానుల ముందు చెప్పేసాడు. అంతేకదా.. భార్య తన సంతోషం కన్నా.. భర్త సంతోషానికి ఎక్కువ విలువనిస్తుంది.

Similar News