శర్వానంద్ సైలెంట్ గా పనికానిచ్చేస్తున్నాడా..?

Update: 2018-08-03 07:30 GMT

శర్వానంద్ మహానుభావుడు సినిమా తర్వాత దర్శకులు హను రాఘవపూడి, సుధీర వర్మలకు కమిట్ అయ్యాడు. పడి పడి లేచే మనసుతో హను రాఘవపూడి సినిమా అప్ డేట్స్ ఎప్పటికప్పుడు మీడియాలో వస్తూనే ఉన్నాయి. సాయి పల్లవితో రొమాన్స్ చేస్తున్న శర్వానంద్ పడి పడి లేచే మనసు సినిమా మీద మంచి అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా డిసెంబర్ లో విడుదలకు సిద్ధమవుతుండగా.. ఈ సినిమా సెట్స్ లో శర్వానంద్, సాయి పల్లవి మధ్య విభేదాలు తలెత్తడంతో... శర్వానంద్ షూటింగ్ కి రాకుండా ఎగ్గొడుతున్నాడని... ఇక సాయి పల్లవి కూడా తన పని ముగించుకుని సెట్స్ నుండి సైలెంట్ గా వెళ్లిపోతుందని ఏవేవో వార్తలొచ్చాయి. కానీ తమ మధ్యన గొడవేం జరగలేదని సాయి పల్లవి చెబుతుంది. శర్వానంద్ కి తనకి ఎటువంటి గొడవ జరగలేదని.. తాను వేరే సినిమా షూటింగ్ కోసం వెళుతున్నాడు కాబట్టే ఈ సినిమా షూటింగ్ కి బ్రేక్ తీసుకున్నాడని.. రెండు సినిమాలకు డేట్స్ అడ్జెస్ట్ చేసుకుంటున్నాడని చెప్పింది.

సుధీర్ వర్మ సినిమా కూడా చేస్తున్నాడా..?

అంటే హను రాఘవపూడి దర్శకత్వంలో పడి పడి లేచే మనసుని పరిగెత్తిస్తున్న శర్వానంద్... సుధీర్ వర్మ సినిమాని పక్కన పెట్టేసాడనే వార్తలు ఎప్పటి నుండో చక్కర్లు కొడుతున్నాయి. కొంతమంది అయితే శర్వా.. సుధీర్ వర్మ ని ఏం చేసావ్ అంటూ సెటైర్స్ కూడా వేస్తున్నారు. ఇక శర్వానంద్ కి ఒకేసారి రెండు సినిమాలు చేసే అలవాటు ఇప్పటివరకైతే లేదు. ఇదిగో ఇవన్నీ చూసాక శర్వానంద్ - సుధీర వర్మ సినిమా మీద వచ్చే వార్తలు ఈజీగా జనాల్లోకి వెళ్లిపోతున్నాయి. కానీ ఇప్పుడు సాయి పల్లవి చెప్పింది చూస్తుంటే మాత్రం శర్వానంద్ నిజంగానే సుధీర్ వర్మ సినిమా కోసం సైలెంట్ గా రంగంలోకి దిగేశాడనిపిస్తుంది.

రెండు పడవల మీద కాలేసిన శర్వా

సాయి పల్లవి, శర్వానంద్ మరో సినిమా షూటింగ్ కి వెళుతున్నాడని చెబుతుంది. దాన్నిబట్టే ఈజీగా మనకు అర్ధమవుతుంది. శర్వానంద్ సుధీర్ వర్మ డైరెక్షన్ లో కూడా నటించేస్తున్నాడని. మరి సైలెంట్ గా శర్వానంద్ తన పని తాను చేసుకుపోతున్నాడన్నమాట. ఇకపోతే పడి పడి లేచే మనసు డిసెంబర్ లో విడుదలకు ప్లాన్ చేస్తుంటే... సుధీర వర్మ సినిమాని ఎప్పుడు విడుదల చేస్తాడో చూడాలి.

Similar News