బ్రాహ్మణ సామాజికవర్గ అమ్మాయి, ముస్లిం అబ్బాయికి మధ్య ప్రేమకథగా తెరకెక్కిన షార్ట్ ఫిలింపై వివాదం రాజుకుంటోంది. హిందువుల, బ్రాహ్మణుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ సినిమా ఉందని, లవ్ జిహాద్ ను ప్రోత్సహించేలా ఉందని బ్రహ్మణ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ మేరకు యూట్యూబ్ నుంచి సినిమా ట్రైలర్ ను తొలగించాలని, సినిమా విడుదల కాకుండా చర్యలు తీసుకోవాలని వారు ఫిలిం సెన్సార్ బోర్డును, పోలీసులను ఆశ్రయించారు. ఈ సినిమాను నిర్మించిన వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నరు.