బిగ్ బాస్ షో పై తన అభిప్రాయాన్ని చెప్పిన సింగర్ స్మిత
తాజాగా సింగర్ స్మిత.. ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బిగ్ బాస్ పై తన అభిప్రాయాన్ని చెప్పారు. బిగ్ బాస్ షో..
బిగ్ బాస్ షో ప్రారంభమై.. విజయవంతంగా ఐదు సీజన్లు పూర్తి చేసుకుని 6వ సీజన్లోకి అడుగుపెట్టింది. ఆదివారం సాయంత్రం సీజన్ 6 గ్రాండ్ గా ప్రారంభమైంది. 21 మంది కంటస్టెంట్లు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. బిగ్ బాస్ షో కోసం ఎదురుచూసేవారు ఎంతమందున్నారో తెలీదు గానీ.. ఆ షో పై విమర్శలు చేసేవారు చాలామందే ఉన్నట్లున్నారు. ఇటీవల సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఈ షోపై పరుష పదజాలంతో స్పందించిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ వంటి షో ను బ్యాన్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
తాజాగా సింగర్ స్మిత.. ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బిగ్ బాస్ పై తన అభిప్రాయాన్ని చెప్పారు. బిగ్ బాస్ షో తనకు నచ్చదన్న ఆమె.. ఒకవేళ ఆ షో నుంచి ఆహ్వానం వచ్చినా అందుకు ఓకే చెప్పి తప్పుచేయదలచుకోలేదన్నారు. అన్ని రోజుల పాటు కుటుంబాన్ని వదిలి ఆ షోలో ఉండాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు. తనకు తెలిసిన వాళ్లు ఎవరైనా ఆ షోకు వెళతామని చెబితే... ఏం వచ్చింది మీకు? అని నిలదీస్తానన్నారు. కొంతమందిని ఒక హౌస్ లో పెట్టి మీరు తన్నుకోండి.. మేము టీఆర్పీ పెంచుకుంటామని చెప్పడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. బిగ్ బాస్ షో చూడటం తనకు ఇష్టం ఉండదని, చూసినా ఏమీ అర్థం కాదన్నారు.