రెండు తెలుగు రాష్ట్రాల్లో నిన్నటివరకు ఏదైనా హాట్ టాపిక్ ఉంది అంటే.. అది కేవలం బిగ్ బాస్ సీజన్ 2 గురించే. గత నెల రోజుల వరకు అంటే బిగ్ బాస్ మొదలైన రెండు నెలల వరకు బిగ్ బాస్ ని నాని.. సీజన్ 1 ఎన్టీఆర్ తో పోల్చేసి అంత క్రేజ్ తేలేకపోతున్నాడని.. అలాగే షోలో కంటెస్టెంట్స్ కూడా అంతంతమాత్రంగా ఉన్నారనే టాక్ ఉంది. అందుకే స్టార్ లో ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 2 మీద ప్రేక్షకుల్లో పెద్దగా ఆసక్తి కనబడలేదు. కానీ బిగ్ బాస్ హౌస్ లోకి సాదాసీదాగా అంటే ఒక మోడల్ గా, టీవీ నటుడిగా పెద్దగా క్రేజ్ లేని టైంలో బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన కౌశల్ అక్కడ బిగ్ హౌస్ లో ఒంటరి పోరాటం అనే పేరుతో.. తల్లి, కూతురు సెంటిమెంట్ తో బిగ్ బాస్ హౌస్ లో ఒక శక్తిగా మారడం.. కౌశల్ తో గొడవ పడిన మిగతా కంటెస్టెంట్స్ ఒక్కొక్కరిగా వారానికొకరు చొప్పున ఎలిమినేట్ అవడంతో.. అలాగే సోషల్ మీడియాలో కౌశల్ ఫాన్స్ మంటూ ఒక ఆర్మీ ఫామ్ అవడం.. కౌశల్ ఆర్మీ సోషల్ మీడియాలో హంగామా చెయ్యడం.. కౌశల్ ఆర్మీ పేరుతొ 2 కె రన్, వీడియోస్, కౌశల్ మీద సాఫ్ట్ కార్నెర్ తేవడానికి వారు సోషల్ మీడియాలో చేసిన హంగామా అంతా బిగ్ బాస్ మీద అందరిలో ఆసక్తిని పెంచేసాయి.
హైదరాబాద్ లో సెట్ వేయడంతో...
అదంతా ఒక ఎత్తైతే... బిగ్ బాస్ ని స్టార్ మా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రసారం చేస్తుంటే... స్టార్ మా కే తెలియకుండా బిగ్ బాస్ లీకులు స్టార్ మాని సమస్యల్లోకి నెట్టేసింది. వారినికొకరు ఎలిమినేట్ అయ్యే సభ్యుడు పేర్లు ఫొటోలతో సహా సోషల్ మీడియాలో... షో టీవీ లో ప్రసారం కాకమునుపే హల్చల్ చెయ్యడం.. అలాగే బిగ్ బాస్ లో జరిగే ప్రతి విషయం ఒక రోజు ముందే సోషల్ మీడియాలో ఉండడంతో.. టీవీలో షో చూసే కన్నా సోషల్ మీడియాని ఫాలో అయితే బెటర్ అనే ఆలోచనల్లో ప్రేక్షకులు ఉండేవారు. ఇక స్టార్ మా కూడా బిగ్ బాస్ లీకులను ఆపలేక చేతులెత్తేసింది. దీనంతటికి కారణం బిగ్ బాస్ సెట్ హైదరాబాద్ నడిబొడ్డున అన్నపూర్ణ స్టూడియోస్ లో వెయ్యడమే. అన్నపూర్ణ స్టూడియోలో బిగ్ బాస్ సెట్ వేసి షో రన్ చేస్తుంటే... అక్కడినుండి ఎలిమినేట్ అయినవారు తమ ఇంటికి చేరుకునే లోపే ఆ విషయం బయటికొచ్చేస్తుంది. బిగ్ బాస్ సీజన్ 1 పూణే లో ఎంతో పకడ్బందీగా సాగబట్టే చిన్న లీక్ కూడా బయటికి రాలేదు. కానీ ఇక్కడ నగరం నడిబొడ్డున అంటే నిమిషాల్లో అన్ని విషయాలు బయటికొచ్చాయి. ఈ లీకుల ప్రవాహం నిన్న గ్రాండ్ ఫినాలే వరకు సాగింది.
ప్రసారం కావడానికి ముందే...
నిన్న స్టార్ మాలో నాని హోస్టింగ్ లో దగ్గుబాటి వెంకటేష్ చీఫ్ గెస్ట్ గా బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే స్టార్ మాలో స్టార్ట్ అయ్యేలోపే... బయట కౌశల్ విన్నర్ అంటూ ఫొటోస్, వీడియోస్ తో సహా బయటికి రావడం... గ్రాండ్ ఫినలేతో అందరిలో ఆసక్తిని క్రియేట్ చేసి స్టార్ మా బిగ్ బాస్ సీజన్ 1 మాదిరిగా అధిక టీఆర్పీ రేటింగ్స్ కోసం ఆశపడింది. కానీ కౌశల్ ఆర్మీ, సోషల్ మీడియా ఫుణ్యమా అని అది కాస్తా లీకులవడంతో.. స్టార్ మా కి టీఆర్పీ విషయంలో చుక్కలు కనబడతాయనడంలో సందేహం లేదు. అసలు ఒక విధంగా సోషల్ మీడియాకి స్టార్ మా తలొగ్గినట్టే. కౌశల్ ని నాని- వెంకటేష్ కలిపి విన్నర్ గా ప్రకటించడం, కౌశల్ బయటికొచ్చి అభిమానులకు అభివాదం చేస్తూ కారెక్కి వెళ్లడం అంతా వీడియో రికార్డ్ చేసి మరీ.. సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యడం... అది కూడా స్టార్ మాలో ప్రసారం కాకముందే బయటికి రావడంతో కౌశల్ బిగ్ బాస్ విన్నర్ కావడానికి, కౌశల్ ఆర్మీ, సోషల్ మీడియా ప్రధాన పాత్ర పోషించాయనడానికి ప్రత్యక్ష ఉదాహరణలు.