సోన‌మ్ తాళిబొట్టు..చేతికా..?

Update: 2018-05-27 09:29 GMT

పెళ్లి తర్వాత కూడా కొంత మంది హీరోయిన్స్ యాక్టింగ్ కంటిన్యూ చేస్తున్నారు. ఇది బాలీవుడ్ లో ఎప్పటినుండో జరుగుతుంది. అయితే నాలుగేళ్లు లవ్ చేసుకుని తన బాయ్ ఫ్రెండ్ ఆనంద్ అహూజాను పెళ్లి చేసుకుంది బాలీవుడ్ భామ సోనమ్ కపూర్. పెళ్లి అయిన అమ్మాయికి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. పెళ్ళైన తర్వాత మహిళలు మెడలో తాళి బొట్టు ధరించాల్సి వస్తుంది. అయితే ముందు నుండే ఈ విషయంపై చాలా క్లారిటీగా ఉంది సోనమ్ కపూర్. తన తాళిని డిఫరెంట్ గా డిజైన్ చేయించింది. తనతో పాటు తన భర్త రాశులకు సంబంధించి చిహ్నాలను లాకెట్స్ మాదిరిగా చేయించి మంగళసూత్రంలో మిక్స్ చేసింది ఈ బ్యూటీ. కాకపోతే ఆ తాళి మేడలో కాదు.. చేతికి బ్రేస్ లెట్ మాదిరిగా నల్లపూసల గొలుసును చుట్టేసింది సోనమ్ కపూర్. ఇలా ఈమె ఇన్నోవేటివ్ ఐడియాకి బాలీవుడ్ లో చాలామంది మెచ్చుకుంటున్నారు.

Similar News