ఏ డైరెక్టర్ కి అయినా రెండు మూడు అట్టర్ ప్లాప్స్ తగిలాయి అంటే ఆ డైరెక్టర్ పనైపోయింది. ఇక ఆ డైరెక్టర్ తో సినిమాలు చేసేందుకు ఏ హీరో గాని నిర్మాతలు గాని సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపరు. ఒకవేళ బై లక్ ఆ డైరెక్టర్ కి ఎవరైనా సినిమా ఇచ్చారంటే ఆ సినిమా విడుదల సమయంలో ఒకవేళ ఆ సినిమా హిట్ లేకపోతే ఇక ఆ డైరెక్టర్ ఇంటికెళ్లాల్సిందే అంటూ సెటైర్స్ కూడా వేస్తారు. ప్రస్తుతం పైన చెప్పిన పొజిషన్ లోనే టాలీవుడ్ లో ఒక డైరెక్టర్ పరిస్థితి ఉంది. పెద్ద పెద్ద స్టార్ హీరోలతో సినిమాలు చేసి అట్టర్ ప్లాప్స్ ఇచ్చిన శ్రీను వైట్ల కి చానళ్లకు రవితేజ అమర్ అక్బర్ ఆంటోని సినిమా అవకాశం ఇచ్చాడు.
అదృష్టవశాత్తు ఆ సినిమాకి మైత్రి మూవీస్ లాంటి మంచి బ్యానర్ దొరికింది. అయితే ఆ బ్యానర్ తనని పిలిచి అవకాశం ఇవ్వలేదని... తానే ఆ బ్యానర్ ని సెలెక్ట్ చేసుకున్నానని చెబుతున్నాడు శ్రీను వైట్ల. రేపు శుక్రవారం అమర్ అక్బర్ ఆంటోని సినిమా విడుదల సందర్భంగా తెగ ఇంటర్వూస్ ఇస్తున్న శ్రీను వైట్ల కాస్త అతి చేస్తున్నట్లుగానే కనబడుతుంది. ఎందుకంటే తనతో సినిమా అదేనండీ అమర్ అక్బర్ ఆంటోని సినిమాని చేసేందుకు ఐదుగురు నిర్మాతలు పోటీ పడ్డారు. ఐదుగురు లోంచి మైత్రీ మూవీ మేకర్స్ని అమర్ అక్బర్ ఆంటోని కోసం నేను ఎంపిక చేసుకున్నా అంటూ గొప్పలు పోతున్నాడు.
ఇక తాను ప్రతి సినిమాని ఓవర్ బడ్జెట్ లో కాకుండా అనుకున్న బడ్జెట్ లోనే చేశానని చెబుతున్నాడు. ప్రస్తుతం ఏమైనా శ్రీను వైట్ల మాత్రం అమర్ అక్బర్ ఆంటోని మీద మాత్రం బాగా నమ్మకం పెట్టుకున్నాడు. ఎందుకంటే ఆ సినిమా హిట్ మీదే శ్రీను వైట్ల ఫ్యూచర్ ఆధారపడి ఉంది. ఆ సినిమా హిట్ అయితేనే స్టార్ హీరోలతో శ్రీను వైట్లకి సినిమాల అవకాశాలు వస్థాయి. ఏ గొప్పలైన సినిమా హిట్ అయితేనే వర్కౌట్ అవుతాయి. కానీ సినిమా ప్లాప్ అయ్యిందా.. గొప్పలు తిప్పలవుతాయి.