టాలీవుడ్లో క్యాస్టింగ్ కౌచ్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన శ్రీరెడ్డి గత కొన్ని రోజులుగా కోలీవుడ్ ప్రముఖులపైనా ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ తమిళ దర్శకులు ఏఆర్ మురుగదాస్, సుందర్ సి, శ్రీకాంత్, రాఘవ లారెన్స్ తనను వేదించారని చెప్పిన ఆమె నటుడు విశాల్ తో తనకు ముప్పు ఉందని ఆరోపించారు. ఈ విషయంపై స్పందించిన హీరో కార్తి... శ్రీరెడ్డి వద్ద వేదింపులకు సంబందించిన ఆధారాలు ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలని, కానీ ఇప్పటివరకు ఆమె ఏ ఆధారాలూ బయటపెట్టలేదని అన్నారు. ఇటువంటి నిరాధార అంశానికి మీడియా ప్రాధాన్యత ఇవ్వాలో లేదో ఆలోచించుకోవాలని హితవు పలికారు. అయితే, క్యాస్టింగ్ కౌచ్ పై హీరోయిన్లు నయనతార, త్రిష, కాజల్ అగర్వాల్, సమంత కూడా బయటకు వచ్చి మాట్లాడాలని శ్రీరెడ్డి తాజాగా కోరారు.