కమెడియన్ గా మంచి కెరీర్ ఉన్నప్పుడు సడన్ గా హీరో అయిపోతానని హీరోల పాత్రలు చేయడానికి హీరో అయ్యాడు సునీల్. స్టార్టింగ్ లో పర్లేదు అనిపించుకున్నా చివరికి వచ్చేసరికి వరస ప్లాప్స్ వచ్చాయి. దాంతో తనకు గుర్తింపు తెచ్చిన కమెడియన్ వేషాలు వేయడానికి రెడీ అయ్యాడు. అనుకున్నట్టుగానే త్రివిక్రమ్ సునీల్ కి 'అరవింద సమేత' లో ఛాన్స్ ఇచ్చాడు. అయితే అందులో సునీల్ పాత్ర కామెడీ చేసే పాత్ర కాకవడంతో ఆ పాత్ర అంతగా పేలలేదు.
ఫ్యాన్స్ కు నిరాశే....
ఆ తరువాత వచ్చిన 'అమర్ అక్బర్ ఆంటోనీ' లో నైనా కామెడీ చేస్తాడు అని ఆశపడ్డ ఫ్యాన్స్ కు నిరాశే మిగిలింది. ఈసినిమాలో అందరి పాత్రలు పేలవంగా ఉండటంతో సునీల్ పాత్ర కూడా అదే విధంగా ఉండటంతో ఎవరు పెద్దగా పటించుకోలేదు. ఇక రెండు రోజులు కిందట వచ్చిన 'పడి పడి లేచె మనసు' లో సునీల్ ఉన్నట్టు అందరికి తెలుసు. దాంతో అంత సునీల్ పాత్ర ఎలా ఉంటుంది అని ఎదురు చూసారు. అయినా కానీ సునీల్ తన పాత్రకు న్యాయం చేయలేకపోయాడు.
కామెడీని పండించలేక...
సెకండ్ హాఫ్ లో వచ్చే సునీల్ పాత్ర చాలా కీలకమైన పాత్రే. నవించే స్కోప్ కూడా ఉంది. కానీ సునీల్ కామెడీ ని పండించలేకపోయాడు. పాత సునీల్ లో ఉన్న బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ ఈ సునీల్ లో కనిపించలేదు. కొన్నికొన్ని సీన్స్ లో సునీల్ ఎక్స్ప్రెషన్ ఇవ్వడమే మర్చిపోయాడు. మరి ఈ సునీల్ లో పాత సునీల్ ఎందుకు కనిపించట్లేదో అర్ధం కావట్లేదు. అది రచయితల తప్పా? సునీల్ తప్పా?? అనేది అర్ధం అవ్వట్లేదు. కమెడియన్ గా సునీల్ కు మంచి కెరీర్ ఉండాలంటే ఇది గుర్తిస్తే మంచిది.