బాలీవుడ్ అంటే కాంట్రోవర్సిస్ ఎక్కువగా ఉంటాయి. అక్కడ నటీనటులు కూడా ఇందుకు కారణం. ఎప్పుడు ఏదొక కాంట్రావర్సీ లో ఉండే రాఖీసావంత్.. సన్నీ లియోన్ కి క్షమాపణలు చెప్పింది. లేటెస్ట్ గా ఖండేల్ వాలా చాట్ షో 'జజ్ బాత్... సంగీన్ సే నమ్కీన్ తక్'లో పాల్గొన్న సందర్భంగా ఈ హాట్ బ్యూటీ సన్నీ కు సారీ చెప్పింది.
తెలియక మాట్లాడా..క్షమించండి..
అర్షిఖాన్ తో కలసి ఓ షోలో పాల్గొన్న రాఖీ.. గతంలో నేను సన్నీ లియోన్ గురించి తెలుసుకోండా కొన్ని విమర్శలు చేశానని గుర్తు చేసుకుంది. సన్నీ బాలీవుడ్ కి వచ్చి హిందీ సినిమాలు చేయడం స్టార్ట్ చేసిన టైంలో నేను కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశానని, అందుకు క్షమించాలని కోరింది. సన్నీ గురించి కానీ, ఆమె జీవితంలో పడిన కష్టాలు గురించి కానీ ఏమి తెలుసుకోండా ఏది పడితే అది మాట్లాడానని.. ఆలా వ్యాఖ్యానించడం తప్పేనని చెప్పింది. ఆలోచించకుండా అలా అనుండాల్సింది కాదని అభిప్రాయపడింది.