వెంకటేష్ - నాగచైతన్య ఒరిజినల్ గా మామా అల్లుళ్లు. అయితే వారి కాంబోలో మూవీ కోసం అక్కినేని, దగ్గుబాటి అభిమానులు ఎప్పటినుండో వేచి చూస్తున్నారు. కానీ మంచి కథ దొరక్క వారు ఇన్నాళ్లు కలిసి సినిమా చేయలేకపోయారు. కాకపోతే ఇన్నాళ్లకు సురేష్ ప్రొడక్షన్ లో జై లవ కుశ దర్శకుడు బాబీ డైరెక్షన్ లో వెంకటేష్, నాగ చైతన్య ఒక మీడియం బడ్జెట్ మల్టీస్టారర్ కి శ్రీకారం చుట్టారు. ఈ సినిమాని సురేష్ బాబు సురేష్ ప్రొడక్షన్ లోనే నిర్మిస్తున్నడు. ఇక బాబీ దర్శకత్వంలో వెంకి మామ టైటిల్ తో ఈ సినిమా ఈ మధ్యనే పూజా కార్యక్రమాలు జరుపుకుంది.
కథ పూర్తిగా నచ్చకపోవడంతో...
అయితే రెగ్యులర్ షూటింగ్ మొదలు కాకముందే ఈ సినిమా ఆగిపోయేలా కనబడుతుంది. ఎందుకంటే నిర్మాత సురేష్ బాబుని దర్శకుడు బాబీ సంతృప్తి చెయ్యలేకపోయాడనే కారణం చెబుతున్నారు. దర్శకుడు బాబు స్టోరీ లైన్ విని సినిమాని మొదలెట్టిన సురేష్ బాబు తర్వాత బాబీ చెప్పిన పూర్తి కథకు సంతృప్తి చెందలేకపోయాడట. ఫైనల్ స్టోరీ నచ్చక ఈ సినిమాని పక్కనబెట్టే ఆలోచనలో సురేష్ బాబు ఉన్నట్లుగా వార్తలొస్తున్నాయి. ఆ కథతో హిట్ అయ్యే ఛాన్స్ ఉంటేనే సినిమా చేద్దామని.. యావరేజ్ అనుకుని కూడా ఈ సినిమాని పట్టాలెక్కించొద్దని సురేష్ బాబు నిర్ణయించుకున్నాడట.
అసలే ఏడాది తర్వాత...
మరి ఆదిలోనే హంసపాదులా... అన్నీ అనుకున్నాక సినిమా పట్టాలెక్కడం లేదంటే.. ఆ దురదృష్టం కేవలం బాబీదే అనుకోవాలి. ఏదో ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో జై లవ కుశ అవకాశమిచ్చి... హిట్ కొట్టిన బాబీకి మళ్లీ మరో ప్రాజెక్ట్ సెట్ కావడానికి ఏడాది పట్టింది. మరి ఇప్పుడా ప్రాజెక్ట్ కూడా మొదలు కాకముందే అటకెక్కడమనేది బాబీ దురదృష్టం గానే చెప్పాలి.